newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇదేవేగంతో కరోనా విజృంభిస్తే 2 రోజుల్లో లక్ష కరోనా కేసులు గ్యారంటీ

03-04-202103-04-2021 11:59:00 IST
2021-04-03T06:29:00.798Z03-04-2021 2021-04-03T06:28:58.670Z - - 16-04-2021

ఇదేవేగంతో కరోనా విజృంభిస్తే 2 రోజుల్లో లక్ష కరోనా కేసులు గ్యారంటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భారత్‌పై కరోనా సెకండ్ వేవ్ దాడి మొదలైపోయింది. ఆరునెలల తర్వాత ఒక రోజులో అత్యధిక కేసుల నమోదులో రికార్డు సృష్టించిన భారత్ శుక్రవారం ఉదయానికి 81 వేలకు పైగా కరోనా కొత్త కేసులను నమోదు చేసింది. గురువారం నుంచి 24 గంటల వ్యవధిలో 81,466 తాజా కేసులు నమోదు కావడంతో అలజడి మొదలైంది. ఒక్క రోజులో దేశంలో 469 మంది కరోనా బారినపడి మరణించడం డిసెంబర్ 6 తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా ఇంతవరకు కరోనా బారిన పడిన మొత్తం రోగుల సంఖ్య 1.23 కోట్లకు పెరిగింది.

గత అక్టోబర్ 2 తర్వాత ఒకేరోజు దేశవ్యాప్తంగా 81 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, పంజాబ్, కేరళ, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రోజువారీ కేసులు పెరిగిపోతన్నాయి. 24 గంటల్లో పెరిగిన మొత్తం కేసుల్లో 84.61 శాతం కేసులు ఈ ఎనిమిది రాష్ట్రాల నుంచే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి విషమించడంతో ఆర్టీ పీసీఆర్ పరీక్షల పీజును ప్రభుత్వం వెయ్యి నుంచి 500 రూపాయలకు తగ్గించింది. ర్యాపిడ్ యాటిజెన్ పరీక్షల ధరలను కూడా తగ్గించారు. పరిస్థితి చేజారిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నిబంధనలను కఠిన తరం చేశారు.

కోవిడ్ కేసులు ఉన్నట్లుండి పెరిగిపోవడంతో అనేక రాష్ట్రాల్లో పాఠశాలలు మూసివేశారు. బహిరంగంగా ప్రజలు సమావేశం కావడంపై  కఠిన ఆంక్షలు విధించారు. తీవ్రంగా ప్రభావితమైన జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించారు.

కాగా బ్రిటన్‌లో విస్తరించిన కొత్త రకం కరోనా వైరస్ వంటిదే భారత్‌లోను ప్రతాపం చూపుతోందని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులెరియా పేర్కొన్నారు. గత డిసెంబర్ క్రిస్టమస్ నాటికి బ్రిటన్‌లో కల్లోలం సృష్టించిన కొత్త రకం కరోనా ఇప్పుడు భారత్‌లో శరవేగంగా విస్తరిస్తోందని చెప్పారు.

కరోనా కేసులు హద్దు మీరిపోవడంతో ఏప్రిల్ నెల మొత్తంగా సెలవులు లేకుండా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను కొనసాగించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ప్రస్తుతం మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభించిన భారత్ 45 ఏళ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చని నిబంధనలు సడలించింది. 

కరోనా వ్యాక్సిన్ ఎంత ఎక్కువమందికి వేస్తే అంత త్వరగా సామూహిక రోగనిరోధక శక్తి జనాభా మొత్తానికి అందుతుందని నిపుణులు చెబుతుండటంతో నిర్బంధంగా అయినా సరే కరోనా వ్యాక్సిన్ వేయించే దశగా కేంద్రప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా కోటీ 23 లక్షలమందికి కరోనా సోకగా ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా సోకిన దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది. కాగా ఇంతవరకు ప్రపంచం మొత్తం మీద 12 కోట్లమందికి కరోనా సోకగా, 28 లక్షల మంది కరోనాకు బలయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

10 రాష్ట్రాలలో కోవిడ్  కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

10 రాష్ట్రాలలో కోవిడ్ కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

   10 hours ago


కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

   14 hours ago


రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

   16 hours ago


సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

   a day ago


మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

   15-04-2021


ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

   19 hours ago


దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

   14-04-2021


ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

   14-04-2021


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

   14-04-2021


ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!

ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!

   14-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle