newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

డబ్బు జనానిదే... ఫ్రీ వ్యాక్సిన్ కు ఎందుకు వెనకడుగు?

29-04-202129-04-2021 15:26:55 IST
2021-04-29T09:56:55.519Z29-04-2021 2021-04-29T08:56:50.007Z - - 25-07-2021

డబ్బు జనానిదే... ఫ్రీ వ్యాక్సిన్ కు ఎందుకు వెనకడుగు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి ఒక్కరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగలదన్న ఆశాభావాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఈ వ్యాక్సిన్ కు సంబంధించి జరుగుతున్న పరిణామాలపై ఇటు కాంగ్రెస్ నేతలతో పాటు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందిస్తూనే ఉన్నారు. మోడీ సర్కార్ తీరుపై వాగ్బాణాలు వేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ను కాకుండా కోవిడ్ నే లక్ష్యంగా చేసుకోండంటూ మోడీకి హితవు పలికారు. గురువారం కూడా వ్యాక్సిన్ వ్యవహారంపైనే మోడీని విమర్శించిన రాహుల్ ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఈ వ్యాక్సిన్ అందాల్సిందేనంటూ డిమాండ్ చేశారు.   

ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తయారీ కంపెనీలపై కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇన్ని కోట్ల ప్రజాధనంతో తయారైన వ్యాక్సిన్ ను మళ్ళీ ప్రజలకే అమ్ముతారా అంటూ కేంద్రాన్ని నిలదీసింది. జనం డబ్బులతో తయారైన వ్యాక్సిన్ ను ఈ సంక్షోభ సమయంలో వారికి ఉచితంగా అందించాలి తప్ప ఈ రేట్ల మోత ఏమిటి అంటూ మోడీ విధానాన్ని దుయ్యబట్టింది. మే ఒకటవ తేదీన 18 ఏళ్ళు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేసేందుకు మూడవ దశ కార్యక్రమాన్ని కేంద్రం చేపడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపైనే అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. ప్రజలందరికీ  ఉచితంగానే వ్యాక్సిన్ అందించాలని ఒక్కో చోట ఒక్కో ధరకు దీనిని విక్రయించడానికి వీలు లేదని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి.    

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ అభ్యర్ధన మేరకే లక్నోలోని మేదాంత ఆసుపత్రికి ఆక్సిజన్ ట్యాంకర్ వెళ్లిందన్న వార్తలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. తమ ఆసుపత్రిలో ఆక్సిజన్ తగ్గిపోతోంది కాబట్టి ఢిల్లీకి చెందిన ఒక ఎన్ జి ఓ సంస్థ ద్వారానే తాము ఈ ఆక్సిజన్ ట్యాంకర్ ను పొందామని మేదాంత డైరెక్టర్ చెబుతున్నారు. దీని వెనుక ఏ రాజకీయం ఉందొ, ఎవరి ప్రమేయం ఉందో  తమకు తెలియదని అన్నారు. ఈ వ్యవహారాన్ని బట్టి చూస్తే ఆసుపత్రులకు ఆక్సిజన్ అందాలన్నా ఏదో ఒక రకమైన రాజకీయ ప్రమేయం గాని, పలుకుబడి గాని ఉండాలన్న వాస్తవం కళ్ళకు కడుతోంది. అవసరంలో ఉన్న అన్ని ఆసుపత్రులకు తక్షణ ప్రాతిపదికన ఆక్సిజన్ ట్యాంకర్ అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికే ఎన్నింటి అవసరాలు తీరుతున్నాయో  ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తప్ప ఏ జాతీయ రాజకీయ పార్టీ గాని నోరు మెదపడం లేదు.   

ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వాన్ని మార్గ నిర్దేశన చేయవలసిన పార్టీలు ఎందుకు మౌనం వహిస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మామూలు పరిస్థితుల్లో అయితే సర్కారు తీరును దుమ్మెత్తి పోసే విపక్షాలు కనీసం నిర్మాణాత్మక రీతిలోనైనా తమ ఉనికిని చాటుకునేందుకు ముందుకు రాకపోవడం విడ్డూరంగానే కనిపిస్తోంది.  

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   an hour ago


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   9 hours ago


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

   21-07-2021


Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

   20-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle