newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల

09-01-202209-01-2022 09:30:29 IST
2022-01-09T04:00:29.206Z09-01-2022 2022-01-09T04:00:25.123Z - - 25-05-2022

ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరపడానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు మే 14తో ముగుస్తుండగా, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీల కాలపరిమితి మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజా నోటిఫికేషన్‌ను ప్రకటించింది. యూపీలో ఏడు దశలు, మణిపూర్‌లో రెండు దశలు, గోవా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.

జనవరి14 న తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్,  తొలి దశ పోలింగ్‌ తేదీ ఫిబ్రవరి - 10 (యూపీలో మాత్రమే), రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 21న, రెండో దశ పోలింగ్‌ ఫిబ్రవరి -14, (పంజాబ్‌, గోవా,ఉత్తరాఖండ్‌, యూపీ)

ఒకే దశలో పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌ ఎన్నికలు మూడో దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 25న, మూడో విడత పోలింగ్‌ ఫిబ్రవరి -20 (యూపీ), నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 27న, నాలుగో విడత పోలింగ్‌ ఫిబ్రవరి -23 (యూపీ), ఐదో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 01న,

ఐదో విడత పోలింగ్‌ ఫిబ్రవరి -27 (యూపీ, మణిపూర్‌), ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 04న, మార్చి 3న ఆరో విడత ఎన్నికలు, (యూపీ, మణిపూర్‌), ఏడో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 10న, మార్చి 7న ఏడో విడత ఎన్నికలు (యూపీ)

మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల అవుతాయని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle