newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మళ్ళీ లాక్ డౌన్ వద్దు.. రాష్ట్రాలకు ఫిక్కీ లేఖ

17-04-202117-04-2021 16:41:07 IST
2021-04-17T11:11:07.305Z17-04-2021 2021-04-17T11:10:13.303Z - - 15-05-2021

మళ్ళీ లాక్ డౌన్ వద్దు.. రాష్ట్రాలకు ఫిక్కీ లేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఎలాంటి లాక్ డౌన్ లకు ఒడిగట్ట వద్దని 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులను భారత్ వాణిజ్య పారిశ్రామిక మండలి సమాఖ్య (ఫిక్కీ) అభ్యర్ధించింది. తొలిదశ కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ల ప్రభావం నుంచి ఆర్హిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందాని ఫిక్కీ అధ్యక్షుడు ఉదయ శంకర్ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ లాక్ డౌన్ వంటి కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితి తారుమారు అయ్యే అవకాశం ఉంటుందని, ఫలితంగా ఆర్ధిక వ్యవస్థ మరింత సంక్షుభితం కావచ్చునని ఆయన అన్నారు. 

కరోనా వైరస్ ను ఎదుర్కొనే చర్యలను ముమ్మర ప్రాతిపదికన ప్రభుత్వాలు చేపడుతున్నప్పటికీ దీని తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు మరోసారి లాక్ డౌన్ అనివార్యమా? అన్న కథనాల నేపథ్యంలో రాష్ట్రాలకు ఫిక్కీ చేసిన అభ్యర్ధన ప్రాధాన్యతను సంతరించుకొంది. పాక్షిక లాక్ డౌన్ విధించినా కూడా దాని ప్రభావం ఆర్హిక వ్యవస్థపై తీవ్రంగానే ఉంటుందని ఓ లేఖలో ఉదయ శంకర్ స్పష్టం చేశారు.   

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్ సహా 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన ఈ లేఖ రాశారు. లాక్ డౌన్ లేదా పాక్షిక లాక్ డౌన్లకు బదులు కోవిడ్ పరీక్షలను ముమ్మరం చేయాలని అలాగే నిబంధనలను అందరూ ఖచ్చితంగా ఆచరించేలా చర్యలు తీసుకోవాలని అయన సూచించారు. ప్రజలలో చైతన్యాన్ని, అవగాహనను కలిగించి కోవిడ్ వ్యాప్తిని నిరోధించాలే తప్ప లాక్ డౌన్ వంటి చర్యల ద్వారా ఆర్హిక వ్యవస్థకు నష్టం కలిగించకూడదని అన్నారు. అలాగే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని, అవసరమైతే ఇందుకోసం ప్రయివేటు భాగస్వామ్యాన్ని తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీకాలు వేయించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. స్కూళ్ళు, కాలేజీలు ఇతర స్వచ్ఛంద సంస్థలకు చెందిన కార్యకర్తల సహాయాన్ని కూడా తీసుకోవాలని కూడా ఉదయ శంకర్ సూచించారు.

10 రాష్ట్రాలలో కోవిడ్ కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు  

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

   11 hours ago


నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   17 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   14-05-2021


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   14-05-2021


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13-05-2021


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle