newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

ఇకపై నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరేనా..!

08-11-202008-11-2020 09:39:56 IST
Updated On 08-11-2020 10:46:42 ISTUpdated On 08-11-20202020-11-08T04:09:56.814Z08-11-2020 2020-11-08T04:09:45.413Z - 2020-11-08T05:16:42.671Z - 08-11-2020

ఇకపై నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరేనా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఫాస్టాగ్.. జాతీయ రహదారుల్లో టోల్ గేట్ల వద్ద పెద్దగా నిరీక్షణ అవసరం ఉండదు. ఫాస్టాగ్ ను తప్పనిసరి చేస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో చర్యలను తీసుకుంటూ ఉంది. కానీ కొన్ని కారణాల వలన అది ఆలస్యం అవుతోంది. టోల్ గేట్ల వద్ద ఇప్పటికే ఫాస్టాగ్ లేన్లను ఎక్కువగా చేశారు. చాలా తక్కువ సంఖ్యలో 'క్యాష్' చెల్లించి వెళ్లే లేన్లను తీసుకుని వచ్చారు. క్యాష్ లేన్ లో నుండి వాహనం ముందుకు కదలడానికి చాలా సమయం పడుతూ ఉండడంతో.. ఫాస్టాగ్ వేయించుకోడానికి చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగా టోల్ గేట్ల వద్దనే ఫాస్టాగ్ సదుపాయాన్ని అందించే కౌంటర్లు కూడా వెలిశాయి. పలు బ్యాంకులు కూడా వినియోగదారులను ఫాస్టాగ్ వేసుకోమని.. అందుకు తగ్గట్టుగా ఆఫర్లను కూడా అందించాయి. 

జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద డిజిటల్‌ పద్దతిలో టోల్‌ ఫీజు చెల్లింపును మరింత వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2021 జనవరి ఒకటో తేదీ నుంచి పాత వాహనాలతోపాటు అన్ని రకాల నాలుగు చక్రాల వాహనాల యజమానులు తప్పనిసరిగా ఫాస్టాగ్‌ ద్వారా టోల్‌ ఫీజు చెల్లించాలని సూచించింది. ఇందుకు సంబంధించి రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (ఎంవోఆర్టీహెచ్‌) శనివారం నాడు నోటిఫికేషన్‌ జారీ చేసింది. రవాణా వాహనాలకు ఫాస్టాగ్‌ పునరుద్దరించిన తర్వాతే ఫిట్‌మెంట్‌ సర్టిఫికెట్‌ జారీ చేయడం తప్పనిసరి అని చేసినట్లు తెలిపింది. కాబట్టి ఇకపై ప్రతి నాలుగు చక్రాల వాహనం ఫాస్టాగ్ చేయించుకోవాల్సిందే..! 

ఇది చదవండి: మహిళల రైలు ప్రయాణం మరింత సేఫ్.. రైళ్లలో మహిళా పోలీసుల గస్తీ


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle