రైతుల మాట వినండి సారూ.. లేకుంటే చాలా కష్టమే..!
03-12-202003-12-2020 17:10:07 IST
Updated On 03-12-2020 17:15:21 ISTUpdated On 03-12-20202020-12-03T11:40:07.015Z03-12-2020 2020-12-03T11:40:00.257Z - 2020-12-03T11:45:21.227Z - 03-12-2020

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. వీరి ఆందోళనకు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఢిల్లీలో నిరసనలు తెలిపేందుకు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు గంటగంటకూ ముందుకు వస్తుండటంతో అధికారులు రహదారులను మూసివేస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రులతో రైతు సంఘాల ప్రతినిధులు జరిపిన సమావేశం విఫలం కావడం, ఎటువంటి నిర్ణయాలూ తీసుకోకపోవడంతో రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఢిల్లీకి ప్రయాణించే నోయిడా వాసులు ప్రత్యామ్నాయంగా ఉన్న రహదారులపై ప్రయాణించాలని కాళింది కుంజ్ రహదారిని ఎంచుకోవాలని, చిల్లా మార్గంలో రావద్దని నోయిడా ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఢిల్లీ - నోయిడా రహదారిపై పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన రైతులు టెంట్లు, వేసుకుని, అక్కడే వంటలు వండుకుని తింటూ తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఢిల్లీకి తూర్పున ఉన్న పంజాబ్, హర్యానా మార్గాల్లోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది. రైతుల ఉద్యమానికి మద్దతుగా పలువురు తమ అవార్డులను వెనక్కు ఇచ్చేస్తూ ఉన్నారు. శిరోమణి అకాళీదళ్ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ (92) కూడా రైతులకు మద్దతు ప్రకటించారు. తనకు వచ్చిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు. రైతులకు మద్దతుగా పద్మ పురస్కారాన్ని ఇచ్చేసిన తొలి వ్యక్తి ఈయనే కావడం గమనార్హం. కేంద్రంతో చర్చలు విఫలం.. నమ్మలేమంటున్న రైతులు 2015లో భారత ప్రభుత్వం బాదల్ ను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. పలువురు క్రీడాకారులు, సెలెబ్రిటీలు కూడా తమ అవార్డులను వెనక్కు ఇచ్చేస్తున్నామని తెలిపారు. రైతుల ఉద్యమం కేంద్ర ప్రభుత్వం మెడకు చుట్టుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. రైతుల డిమాండ్లను నెరవేర్చడమే మంచిదని ప్రభుత్వానికి పలువురు హితవు పలుకుతూ ఉన్నారు.

నమ్మించి వంచించారు.. ఎవ్వరినీ వదలం.. ఢిల్లీ పోలీసు చీఫ్
an hour ago

పెట్రోల్ రేట్.. కనీవినీ ఎరుగని అద్భుతం
2 hours ago

నేపాల్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మోదీకి ప్రధాని ఓలి కృతజ్ఞతలు
3 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా
4 hours ago

ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో 'TCS'కు మూడోస్థానం
5 hours ago

ఫిబ్రవరి 1న పార్లమెంటుకు రైతుల ర్యాలీ నిలిపివేత
6 hours ago

అమెరికా 71వ విదేశాంగ మంత్రిగా అంటోనీ బ్లింకెన్ నియామకం
7 hours ago

ఇంకేంటి.. సినిమా థియేటర్లు ఫుల్ కెపాసిటీతో..!
18 hours ago

డబుల్ డిజిట్ వృద్ధి భారత్‌కే సాధ్యం.. ఐఎమ్ఎఫ్ అంచనా
a day ago

భారత్‌లో టీకా అమ్మకాలకు ఫైజర్ తీవ్ర యత్నాలు
27-01-2021
ఇంకా