newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

ఢిల్లీలో ట్రాక్టర్ తగలబెట్టిన రైతులు.. ప్రభుత్వం పట్టించుకునేనా

28-09-202028-09-2020 11:11:41 IST
Updated On 28-09-2020 11:18:26 ISTUpdated On 28-09-20202020-09-28T05:41:41.460Z28-09-2020 2020-09-28T05:41:25.443Z - 2020-09-28T05:48:26.316Z - 28-09-2020

ఢిల్లీలో ట్రాక్టర్ తగలబెట్టిన రైతులు.. ప్రభుత్వం పట్టించుకునేనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రైతులకు నచ్చని వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా నిరసనలు ఉన్నా.. రైతులు ఆందోళన చేస్తున్నా కూడా వ్యవసాయ బిల్లులు చట్టరూపం దాల్చాయి. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు–2020, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల బిల్లు–2020, నిత్యావసరాల(సవరణ) బిల్లు–2020 లకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం నాడు ఆమోదం తెలిపారు.  

వ్యవసాయం బిల్లులకు వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. పంజాబ్‌, హర్యానాతో పాటు రాజస్తాన్‌, ఉత్తర ప్రదేశ్‌లోనూ రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా నిరసనలు మొదలయ్యాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం‌ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని పెద్ద ఎత్తున రైతులు ఇండియా గేట్‌ వద్దకు చేరుకున్నారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ట్రాక్టర్‌ను దగ్ధం చేశారు. ప్రధాని మోదీ దిష్టి బొమ్మను సైతం తగలబెట్టడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పంజాబ్‌ యూత్‌ కాం‍గ్రెస్‌ ఆధ్వరంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకున్నా ఇండియా గేట్‌ ముందు కూర్చుని ధర్నా నిర్వహించారు. రైతుల ఉద్యమానికి మద్దతు తెలపాని కాంగ్రెస్‌ పార్టీ దేశంలోని ప్రధాన పార్టీలను కోరింది.

వ్యవసాయ రంగం, రైతుల పాలిట కేన్సర్‌లా మారిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాలనీ, ఈ విషయంలో ఎన్‌డీఏను వీడి బయటకు రావాలని జేడీయూ, ఎల్‌జేపీ, జేజేపీ పార్టీలను కాంగ్రెస్‌ కోరింది. ఇప్పటికే పలు పార్టీలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టాయి. 

పార్లమెంట్‌ ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్‌ 20న పార్లమెంట్‌ ఈ బిల్లులను ఆమోదించింది. వ్యవసాయ బిల్లులను ఆమోదించరాదని, వాటిని తిప్పిపంపాలని గతవారం విపక్షాలకు చెందిన ప్రతినిధులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కోరారు. అయినప్పటికీ ఆయన ఆమోద ముద్ర వేశారు.


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle