రైతుల ఆందోళనలపై కెనడా ప్రధాని వ్యాఖ్యలు సహించం.. భారత్
05-12-202005-12-2020 10:32:13 IST
2020-12-05T05:02:13.767Z05-12-2020 2020-12-05T04:53:45.850Z - - 28-01-2021

భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా తలదూర్చడాన్ని కేంద్రప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనపై కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, పార్లమెంట్ సభ్యులు చేసిన వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది. ఇలాంటి చర్యలు ఇకపై కొనసాగితే ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలో కెనడా హైకమిషనర్‌కు ఆ దేశ మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యల తీవ్రతను తెలియజేసింది. కెనడాలోని భారత కమిషన్, కౌన్సిలేట్ల ముందు ఉగ్రవాద కార్యకలాపాల సమావేశాలను ప్రోత్సహించటం శాంతి, భద్రతలకు ముప్పవుతుందని తెలిపింది. కాగా, గత సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కెనడా ప్రధాని ట్రూడో ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనపై మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసనలు చేపట్టే హక్కులకు కెనడా ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుంది అని వ్యాఖ్యానించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ట్రూడో సంఘీభావం పరిధులు దాటినట్లేనా? శాంతియుత నిరసన హక్కులకు కెనడా ఎల్లప్పుడూ మద్దతునిస్తుంది అంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత రైతులకు సంఘీభావం తెలిపారు. ఇండియాలో రైతు నిరసనల గురించి వస్తున్న వార్తలు వింటున్నాం. అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎలా ఉన్నారోనన్న విషయం మనల్ని కలవరపెడుతుంది. మీ అందరి మనసుల్లో చెలరేగుతున్న కల్లోలం గురించి నేను అర్థం చేసుకోగలను. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి వాళ్లకు మనం అండగా ఉన్నాం అంటూ సిక్కు సోదరులకు అభయమిచ్చారు. గురునానక్ 551వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఆన్లైన్ ఈవెంట్లో జస్టిన్ ట్రూడో ప్రసంగించారు. ఒక సమస్య గురించి చర్చించడం అన్నింటి కంటే ముఖ్యమైనది. ఈ విషయం గురించి భారత అధికారులతో మాట్లాడి మన ఆందోళనను తెలియజేద్దాం. మనమంతా కలిసికట్టుగా ఉండాల్సిన సమయం ఇది అని ట్రూడో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వరల్డ్ సిక్కు ఆర్గనైజేషన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు, రైతు సంఘాల నేతలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వేలాది మంది పంజాబ్, హరియాణా నుంచి ఢిల్లీకి పయనమై కేంద్రానికి తమ గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. అనేక పరిణామాల అనంతరం ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. రైతులను చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు మంగళవారం వారితో మట్లాడి సమస్యలకు పరిష్కారం కనుగొంటామని కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. దేశ రాజధానిలో భారత రైతులు చేస్తున్న నిరసనపై స్పందించిన తొలి విదేశీ నేత ట్రూడోనే కావడం గమనార్హం.

నమ్మించి వంచించారు.. ఎవ్వరినీ వదలం.. ఢిల్లీ పోలీసు చీఫ్
2 hours ago

పెట్రోల్ రేట్.. కనీవినీ ఎరుగని అద్భుతం
3 hours ago

నేపాల్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మోదీకి ప్రధాని ఓలి కృతజ్ఞతలు
4 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా
5 hours ago

ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో 'TCS'కు మూడోస్థానం
6 hours ago

ఫిబ్రవరి 1న పార్లమెంటుకు రైతుల ర్యాలీ నిలిపివేత
7 hours ago

అమెరికా 71వ విదేశాంగ మంత్రిగా అంటోనీ బ్లింకెన్ నియామకం
8 hours ago

ఇంకేంటి.. సినిమా థియేటర్లు ఫుల్ కెపాసిటీతో..!
19 hours ago

డబుల్ డిజిట్ వృద్ధి భారత్‌కే సాధ్యం.. ఐఎమ్ఎఫ్ అంచనా
27-01-2021

భారత్‌లో టీకా అమ్మకాలకు ఫైజర్ తీవ్ర యత్నాలు
27-01-2021
ఇంకా