newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

భారత్ కు ఎఫ్‌-18 యుద్ధ విమానాల‌ను అందించనున్న అమెరికా

28-10-202028-10-2020 14:53:50 IST
Updated On 28-10-2020 15:30:12 ISTUpdated On 28-10-20202020-10-28T09:23:50.644Z28-10-2020 2020-10-28T09:23:15.885Z - 2020-10-28T10:00:12.894Z - 28-10-2020

భారత్ కు ఎఫ్‌-18 యుద్ధ విమానాల‌ను అందించనున్న అమెరికా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భార‌త్‌, అమెరికా మ‌ధ్య బంధం మ‌రింత బ‌ల‌ప‌డ‌నున్న‌ది.  భార‌త నౌకాద‌ళం కోసం ఎఫ్‌-18 యుద్ధ విమానాల‌ను అందించేందుకు అమెరికా అంగీక‌రించింది. భార‌తీయ యుద్ధ నౌక‌ల కోసం ఫైట‌ర్ జెట్ల‌ను ఇస్తున్న‌ట్లు అమెరికా వెల్ల‌డించింది.  అమెరికా నుంచి 57 ఫైట‌ర్ జెట్ల‌ను కొనుగోలు చేసేందుకు కొన్నేళ్ల క్రితం భార‌తీయ నేవీ ఆస‌క్తి చూపించింది.  ఐఎన్ఎస్ విక్ర‌మాదిత్య యుద్ధ‌నౌక కోసం యుద్ధ విమానాల‌ను కొనుగోలు చేయ‌నున్నారు. అమెరికా-భారత్ దేశాల మంత్రుల మ‌ధ్య ప‌లు ర‌క్ష‌ణ ఒప్పందాలు కుదిరిన విష‌యం తెలిసిందే. ఆ ఒప్పందంలో భార‌తీయ నేవీకి ఎఫ్‌-18 విమానాల‌ను ఇచ్చేందుకు అమెరికా ప్ర‌భుత్వం అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది.   

భారత, చైనా బలగాల మధ్య హింసాత్మక రీతిలో ఘర్షణలు జరిగిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారత్ కు తమ సహకారం ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేశారు. తాము భారత్ వైపేనని.. భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలకు అమెరికా మద్దతుగా నిలుస్తుందని వెల్లడించారు. రెండు దేశాలు అనేక అంశాల్లో తమ భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. మైక్ పాంపియో, అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పర్ సోమవారం భారత పర్యటనకు వచ్చారు. వీరిరువురు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో సమావేశమయ్యారు. 

చదవండి: యుద్ధం త‌ప్ప‌దేమో

ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భారత, అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రుల 2+2 సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బేసిక్ ఎక్చేంజ్ అండ్ కోపరేషన్ అగ్రిమెంట్ (బెకా)పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఉపగ్రహాలు, సెన్సార్లు సేకరించే సమాచారాన్ని పంచుకునేందుకు ఇరుదేశాలు అంగీకారం తెలిపాయి. అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీ, జియో స్పేషియల్ మ్యాప్ లు ఇచ్చిపుచ్చుకునేందుకు వీలవుతుంది.  రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ 'బెకా' ఒప్పందం కుదరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలు సహా కీలకాంశాలపై సమగ్రంగా చర్చించామని వెల్లడించారు. ఇరుదేశాల సైన్యం మధ్య పరస్పర సహకారం క్రమంగా బలోపేతం కానుందని అన్నారు. ఇండో-పసిఫిక్ దేశాల్లో శాంతి నెలకొల్పేందుకు భారత్, అమెరికా కట్టుబడి ఉన్నాయని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle