newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రభుత్వంపై భిన్నాభిప్రాయం ప్రకటించడం దేశద్రోహం కాదు.. సుప్రీంకోర్టు

04-03-202104-03-2021 18:06:24 IST
2021-03-04T12:36:24.910Z04-03-2021 2021-03-04T12:36:21.090Z - - 11-04-2021

ప్రభుత్వంపై భిన్నాభిప్రాయం ప్రకటించడం దేశద్రోహం కాదు.. సుప్రీంకోర్టు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభుత్వ అభిప్రాయానికి బిన్నమైన దృక్కోణాలు కలిగి ఉన్నంత మాత్రాన వాటిని దేశద్రోహంగా భావించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎంపీ ఫరూక్ అబ్దుల్లాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టపడేసింది. పైగా పిటిషన్ దారుకు 50 వేలరూపాయల అపరాధం విధించింది.

నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి, ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్తాన్, చైనా సహకారం కోసం ప్రయత్నించాడని ఆరోపిస్తూ పిటిషనర్లు రజత్ శర్మ, నేహ్ శ్రీవాత్సవలు ఆర్టికల్ 370 కింద జమ్మూ కశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఫరూఖ్ అబ్దుల్లా తీవ్ర వ్యాఖ్యలు చేశారని సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం 2019లో రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఫరూక్ అబ్దుల్లా ఒక దేశద్రోహి అని, తనను పార్లమెంటు సభ్యుడిగా కొనసాగడాన్ని అనుమతిస్తే దేశంలో ఎవరైనా జాతి వ్యతిరేక కార్యకలాపాలు సాగించడానికి అనుమతించినట్లు అవుతుందని, ఇది దేశ ఐక్యతకు వ్యతిరేకమని పిటిషన్ దార్లు వాదించారు.

పైగా ఆర్టికల్ 370 కింద జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడానికి కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యలను ఫరూఖ్ అబ్దుల్లా తీవ్రంగా ఖండిస్తూ వ్యాఖ్యలు చేశారని, కేంద్రప్రభుత్వ చర్చను అడ్డుకోవడానికి ఫరూఖ్ అబ్దుల్లా చివరకు చైనా, పాకిస్తాన్ సహాయం తీసుకోవాలని కూడా చూశారని పిటిషన్ దార్లు ఆరోపించారు.

ఈ అంశమే విచారణకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. ప్రభుత్వానికి భిన్నమైన వ్యాఖ్యానం చేసినంత మాత్రాన అలాంటివారు దేశద్రోహానికి పాల్పడినట్లేనా అని ఉన్నత నాయస్థానం నిగ్గదీసింది. చివరకు పిటిషన్‌ను కొట్టిపడేసిన సుప్రీంకోర్టు అర్థరహిత పిటిషన్ల ద్వారా న్యాయస్థానం సమయాన్ని వృధా చేస్తున్నారని మందలిస్తూ పిటిషన్ దార్లకు రూ. 50 వేలు జరిమానా విధించింది.

83 సంవత్సరాల వయసున్న ఫరూఖ్ అబ్దుల్లా శ్రీనగర్ నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీగా వ్యవహరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లాతోపాటు వందలాది కశ్మీరీ నాయకులను, కార్యకర్తలను ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా నిరసన తెలుపకుండా ముందుజాగ్రత్తగా 2019 మధ్యలో గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. 

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

   9 hours ago

ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

   13 hours ago

టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

   19 hours ago

ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

   20 hours ago

ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

   09-04-2021

వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

   09-04-2021

అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

   09-04-2021

డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

   08-04-2021

పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

   08-04-2021

అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

   08-04-2021

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle