newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

తండ్రి ముందే లొంగిపోయిన తీవ్రవాది.. అచ్చం సినిమాలో ఘటన లాగే..!

17-10-202017-10-2020 12:45:20 IST
Updated On 17-10-2020 12:50:36 ISTUpdated On 17-10-20202020-10-17T07:15:20.606Z17-10-2020 2020-10-17T07:15:12.781Z - 2020-10-17T07:20:36.379Z - 17-10-2020

తండ్రి ముందే లొంగిపోయిన తీవ్రవాది.. అచ్చం సినిమాలో ఘటన లాగే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాశ్మీర్ లో ఎంతో మంది అమాయక యువతకు మాయ మాటలు చెప్పి, లేని పోనివి చెప్పి తీవ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా చేస్తూ ఉన్నారు. అలా ఆకర్షితుడై తీవ్రవాదుల చెంత చేరిన ఓ కాశ్మీరీ యువకుడు తండ్రి మాట విని వచ్చేశాడు. ఉగ్రవాదానికి ఆకర్షితుడై అందులో చేరిన యువకుడు అక్కడ ఇమడలేక తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరాలని భావించాడు. ఎన్‌కౌంటర్ తప్పదని భావించిన అతడిని జవాన్లు ఏమీ చేయకుండా అతడి తల్లిదండ్రులకు అప్పగించారు.

ఈ నెల 13న శ్రీనగర్‌లోని చదూర ప్రాంతానికి చెందిన జహంగీర్ భట్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. కుమారుడి కోసం తల్లిదండ్రులు గాలింపు మొదలుపెట్టారు.  ఓ ఆపరేషన్‌లో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని చుట్టుముట్టాయి. కనిపించకుండా పోయిన జహంగీరే అని గుర్తించిన సైనికులు వెంటనే అతడి తండ్రికి సమాచారం అందించి అక్కడికి పిలిపించారు. లొంగిపోవాలంటూ ఆయనతో చెప్పించారు. ప్రాణభయంతో పొదల మాటున నక్కాడు జహంగీర్‌. తండ్రి మాట వినిపించడం.. జవాన్లు కూడా అతడి ప్రాణానికి హామీ ఇవ్వడమే కాకుండా.. ఏమీ చేయబోమని, దేవుడి మీద, కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి చెబుతున్నామని, బయటకు రావాలని కోరారు. వారి మాటలు నమ్మిన జహంగీర్ తుపాకిని పక్కన పడేసి చేతులు పైకెత్తి వారి ఎదుటకు వచ్చి లొంగిపోయాడు. అనంతరం అతడిని తండ్రికి అప్పగించారు. ఉగ్రవాదం వైపు అతడు ఆకర్షితుడు కాకుండా చూసుకోవాలని తండ్రికి సూచించారు. 

సరెండర్‌ సందర్భంగా అధికారులు అతని నుంచి ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోలో ఒక సైనికుడు, పోరాట భద్రతా సామగ్రిని ధరించి, చేతిలో రైఫిల్‌ పట్టుకుని ఉన్నాడు.వైరల్ అవుతున్న వీడియోలో ఉగ్రవాది తండ్రి తన కొడుకును కాపాడినందుకు భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలపడం చూడవచ్చు. ఆ సమయంలో సిబ్బంది "అతన్ని మళ్ళీ ఉగ్రవాదులతో వెళ్లనివ్వవద్దు" అని జహంగీర్‌ తండ్రికి సూచిస్తారు. ఈ సందర్భంగా జీఓసీ 15 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు మాట్లాడుతూ.. భద్రతా సిబ్బంది అతడిని సజీవంగా తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉంది అని అన్నారు. అక్టోబర్ 13 న, ఒక ఎస్‌పీఓ (స్పెషల్ పోలీస్ ఆఫీసర్) మరణించారు. అతడి వద్ద ఉన్న రెండు ఏకే -47 (రైఫిల్స్)  కనిపించకుండా పోయాయి. అదే రోజునే జహంగీర్‌ భట్ తప్పిపోయాడు. కుటుంబ సభ్యులు అతడి కోసం గాలిస్తున్న సమయంలో  ఉమ్మడి ఆపరేషన్‌లో అతడిని గుర్తించాము. ప్రోటోకాల్ ప్రకారం, భారత సైన్యం వ్యక్తిని లొంగిపోయేలా ఒప్పించే ప్రయత్నాలు చేసింది. జహంగీర్‌ లొంగిపోయాడని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. 



టిక్కెట్లు ర‌ద్దు చేసుకోండి.. డ‌బ్బులిస్తం

టిక్కెట్లు ర‌ద్దు చేసుకోండి.. డ‌బ్బులిస్తం

   36 minutes ago


ఇదేంద‌య్యా  ఇది

ఇదేంద‌య్యా ఇది

   3 hours ago


ఈసారి కూడా ట్రంపే గెలిస్తే.. అది అమెరికాకు పెద్ద గుణపాఠం హిల్లరీ క్లింటన్

ఈసారి కూడా ట్రంపే గెలిస్తే.. అది అమెరికాకు పెద్ద గుణపాఠం హిల్లరీ క్లింటన్

   3 hours ago


త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేస్తున్నాము

త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేస్తున్నాము

   20 hours ago


భారత్ కు ఎఫ్‌-18 యుద్ధ విమానాల‌ను అందించనున్న అమెరికా

భారత్ కు ఎఫ్‌-18 యుద్ధ విమానాల‌ను అందించనున్న అమెరికా

   20 hours ago


కశ్మీరు భూములు ఇకపై అందరివీ.. ఎవరైనా కొనొచ్చన్న కేంద్రం

కశ్మీరు భూములు ఇకపై అందరివీ.. ఎవరైనా కొనొచ్చన్న కేంద్రం

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్

కరోనా కేసుల అప్డేట్

   a day ago


అమెరికాతో ఒప్పందం చరిత్రాత్మకం.. రక్షణమంత్రి రాజ్‌నాథ్

అమెరికాతో ఒప్పందం చరిత్రాత్మకం.. రక్షణమంత్రి రాజ్‌నాథ్

   28-10-2020


హిమాల‌యాల్లో భూమి కొంటారా.. బ్యాగులో డ‌బ్బులు స‌ర్దుకోండి

హిమాల‌యాల్లో భూమి కొంటారా.. బ్యాగులో డ‌బ్బులు స‌ర్దుకోండి

   28-10-2020


కేసుల తగ్గుదల తుపానుకు ముందు ప్రశాంతతే.. ముంచుకొస్తున్న సెకండ్ వేవ్

కేసుల తగ్గుదల తుపానుకు ముందు ప్రశాంతతే.. ముంచుకొస్తున్న సెకండ్ వేవ్

   27-10-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle