newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

12-05-202112-05-2021 19:22:59 IST
Updated On 13-05-2021 07:33:13 ISTUpdated On 13-05-20212021-05-12T13:52:59.567Z12-05-2021 2021-05-12T13:52:27.346Z - 2021-05-13T02:03:13.918Z - 13-05-2021

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ముంబయి: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే విషయంలో ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టలేక పోయాయని న్యాయస్థానాలు వరుసగా తప్పు బడుతూనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరును బొంబాయి హైకోర్టు విమర్శించింది. "మన దేశంలో ప్రతీది ఆలస్యంగా జరుగుతుంది.  ఇంటింటి టీకాల విషయంలోనూ ఎంతో జాప్యం జరిగింది. అందుకే ఎందరినో కోల్పోయాం. ఇప్పటికైనా వృద్ధుల కోసం దీనిని చేపట్టాలి" అని కేంద్రానికి స్పష్టం చేసింది. సీనియర్ సిటిజన్లకు సంబంధించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకు వెళ్లి ఉన్నట్లయితే ఎందరి ప్రాణాలొ దక్కి ఉండేవని తెలిపింది.

కొన్ని నెలల క్రితమే కేంద్రం ఈ చర్యలను చేపట్టి ఉండాల్సిందని, అలా చేయక పోవడం వల్లే ఎందరో ప్రముఖులను కూడా పోగొట్టుకున్నామని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్త  సారధ్యంలోని ఈ ధర్మాసనం ఇంటింటి టీకాల కార్యక్రమాన్ని సీనియర్ సిటిజన్ల కోసం ఎందుకు ప్రారంభించకూడదని కేంద్రాన్ని ప్రశ్నించింది. 75 సంవత్సరాలు దాటిన పౌరులు వ్యాక్సినేషన్ కేంద్రాలకు రాలేరు కాబట్టి ఇళ్ల వద్దకే వెళ్లి వారికి టీకాలు వేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటీషన్ ను హైకోర్టు విచారించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి మూడు వారాలైందని, ఇంతవరకు తన నిర్ణయమేమిటో చెప్పనే లేదని పేర్కొన్న కోర్టు 19వ తేదీ లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. 

నేనొక్కణ్ణే ఏం చేయగలను.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిపై సీరం సిఈఓ 

అనేక దేశాలలో ఇంటింటి వ్యాక్సినేషన్ ఎప్పుడో మొదలైందని న్యాయమూర్తి కులకర్ణి ఈ సందర్బంగా గుర్తు చేశారు. సీనియర్ సిటిజన్ల జీవితాలకు సంబంధించినదైనప్పుడు ఇంటింటి టీకాలను ఎందుకు మొదలెట్టకూడదు అని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద క్యూలలో సీనియర్ సిటిజన్లు నిలబడి ఉండటం, కొందరు చక్రాల కుర్చీలలో తమ వంతు కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు ఎంతో ఆవేదన కలిగిస్తున్నాయని కోర్టు పేర్కొంది.

ఇప్పటికే ఎన్నో రోగాలతో ఉన్న ఈ వయోవృద్ధులు అలా క్యూలలో నిల్చొని కోవిడ్ వైరస్ కు గురి కావలసిన అవసరం ఉందా? అని కోర్టు ప్రశ్నించింది. ఎన్నో రంగాలలో తమ ప్రతిభను కనబరచి వాటిని ఉద్ధరించిన వారెందరో కోవిడ్ వల్ల మరణించారని ఇప్పుడున్న వయోవృద్ధులు అలాంటి అవసరం రాకుండా ఇళ్లకు వెళ్లి టీకాలు వేయడం ఎంతో అవసరమని కోర్టు తెలిపింది. వ్యాక్సిన్ల లభ్యత అంశాన్ని కూడా కోర్టు ఈ సందర్బంగా ప్రస్తావించడంతో  అలాంటి సమస్య ఏమీ ఉండదని, త్వరలోనే కోవిషీల్డ్ వ్యాక్సిన్లు వస్తాయని అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ తెలిపారు.  వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారో  తెలియాజేయాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు సంబంధించిన వివరాలు తమకు అందజేయాలని ఆదేశించింది.   

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

   41 minutes ago


బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   5 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   21 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle