newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

భారత్ ను మురికి దేశమన్న ట్రంప్.. బైడెన్ ఏమని సమాధానం ఇచ్చాడంటే

25-10-202025-10-2020 12:51:32 IST
2020-10-25T07:21:32.198Z25-10-2020 2020-10-25T07:21:24.577Z - - 03-12-2020

భారత్ ను మురికి దేశమన్న ట్రంప్.. బైడెన్ ఏమని సమాధానం ఇచ్చాడంటే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

డొనాల్డ్ ట్రంప్.. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతూ ఉంటారు. ఒక్కోసారి ఆ వ్యాఖ్యలు ఇతరులను నొప్పిస్తూ ఉంటాయి. అవేవీ అతడికి పట్టవు.. భారత్ ను ఇటీవలే మురికిదేశమంటూ చెప్పుకొచ్చారు ట్రంప్. భారత్‌లో గాలి నాణ్యత చాలా మురికిగా ఉందని ఆరోపించారు. భారత్, రష్యా, చైనాలో గాలి నాణ్యత ఎంత మురికిగా ఉందో చూడండి అంటూ కామెంట్ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన చివరి ప్రెసిడెన్షియల్ డిబెట్‌లో ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు.

అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన ఇద్ద‌రు అభ్య‌ర్ధులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య మూడో డిబేట్‌లో మాట్లాడారు. ఇందులో ఇద్దరు అభ్యర్థులు పర్యావరణ మార్పులపై చర్చించారు. ఈ సందర్భంగా ట్రంప్.. భారత్‌పై అక్కసును వెళ్లగక్కారు. పర్యావరణాన్ని భారత్ కలుషితం చేస్తోందని ఆరోపించారు. భారత్ మురికి దేశమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ప్రత్యర్థి, డెమొక్రటిక్ నేత జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  మిత్రదేశాలతో అలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. వాతావరణ మార్పు వంటి సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని, వాటిని పరిష్కరించే మార్గం ఇది కాదని అన్నారు. భారత్‌తో అమెరికా భాగస్వామ్యాన్ని తాను, కమలా హరిస్ ఎంతో విలువైనదిగా భావిస్తామన్నారు. అప్పట్లో ఒబామా-బైడెన్ ప్రభుత్వ హయాంలో భారత్, అమెరికా మధ్య సత్సంబంధాలను కొనసాగించామని గుర్తు చేశారు. బైడెన్-కమలా హారిస్ పాలనతో మరింత ఎక్కువ భాగస్వామ్యంతో సంబంధాలు కొనసాగిస్తామని బైడెన్ చెప్పుకొచ్చారు. భారత్ తనకు మిత్రదేశమని ట్రంప్ బహిరంగంగా చెబుతూ ఉంటాడు. కానీ చాలా సార్లు భారత్ మీద అక్కసు వెళ్లగక్కుతూ ట్రంప్ చాలా వ్యాఖలు చేశాడు. తాజాగా మురికిదేశమంటూ అతడు చేసిన వ్యాఖ్యలను చాలా మంది తప్పుబడుతూ ఉన్నారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle