newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

ప్రపంచ పర్యావరణానికి భారత్ విఘాతం.. నోరు పారేసుకున్న ట్రంప్

17-10-202017-10-2020 12:28:51 IST
2020-10-17T06:58:51.128Z17-10-2020 2020-10-17T06:58:48.055Z - - 29-10-2020

ప్రపంచ పర్యావరణానికి భారత్ విఘాతం.. నోరు పారేసుకున్న ట్రంప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనా, రష్యాలతో కలిసి భారత్‌ ప్రపంచ పర్యావరణానికి విఘాతం కలిగిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. నార్త్‌ కరోలినాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్‌ తన నేతృత్వంలో అమెరికా ఇంధన స్వయం సమృద్ధి సాధించిందని చెప్పారు. మన పర్యావరణ, ఓజోన్‌ ఇతర గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. మరోవైపు ఇండియా, చైనా, రష్యాలు వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయి అని ఆయన ర్యాలీలో ఆరోపించారు.

అవకాశం వచ్చినప్పుడల్లా పర్యావరణం విషయంలో చైనాతో పాటు భారత్‌పై డోనాల్డ్ ట్రంప్‌ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. పారిస్‌ డీల్‌తో ఈ రెండు దేశాలకు బాగా మేలు జరుగుతుందని, యూఎస్‌కు ఏమీ ఉపయోగం ఉండదని ఆయన విమర్శించారు. పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన పారిస్‌ డీల్‌ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ట్రంప్‌ 2017లో ప్రకటించారు. ఈ డీల్‌తో తమకు కోట్లాది డాలర్ల వ్యయం అవుతుందని, పలు ఉద్యోగాలు పోతాయని అప్పట్లో ట్రంప్‌ విమర్శించారు. తాజాగా ఇదే అక్కసును మరోమారు వెలిబుచ్చారు.  

ప్లాస్టిక్ వాడకం తగ్గించి కాగితం వాడాలా.. క్రేజీ.. 

పర్యావరణాన్ని రక్షించే క్రమంలో ప్లాస్టిక్‌ వాడకం తగ్గించి దాని బదులు పేపర్‌ వాడకం జరపాలన్న వాదనను ట్రంప్‌ ఎద్దేవా చేశారు. ఇలాంటి సూచనలిచ్చేవాళ్లను ‘క్రేజీ’అంటూ ఎగతాళి చేశారు. అమెరికాలో స్వదేశీయులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించడానికి  ఎన్నో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. స్వదేశీయులను కాదని విదేశీయులతో ఉద్యోగాలు నింపినందుకు టెన్నెసీ వాలీ అథార్టీ చైర్మన్‌ను తాను తొలగించినట్లు చెప్పకొచ్చారు.  అక్రమవలసదారులకు పౌరసత్వ కల్పిస్తానన్న బైడెన్‌ వ్యాఖ్యలను ఆయన దుయ్యబట్టారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల గెలుపు-ఓటములను నిర్ణయించే రాష్ట్రాలలో ఒకటైన నార్త్ కరోలినా‌లో గురువారం రోజు ట్రంప్ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వాతావరణ కాలుష్యానికి భారత్, చైనా, రష్యా దేశాలే కారణమన్నారు. ఈ మూడు దేశాలు కాలుష్య కారకాలను తీవ్ర స్థాయిలో గాలిలోకి విడుదల చేస్తున్నాయని ఆరోపించారు. దీంతో పర్యావరణం దెబ్బతింటోంది విమర్శించారు. పర్యావరణ పరిరక్షణకు అమెరికా కట్టుబడి ఉందని, అందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. 

‘మీకు నేనెప్పుడూ చెబుతూనే ఉంటాను. మీకు కూడా తెలుసు. నాకు స్వచ్ఛమైన గాలి అంటే ఇష్టం. కానీ రష్యా, చైనా, భారత్ వంటి దేశాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. మీ సలహా ఏంటో చెప్పండి’ అంటూ తన మద్దతురాలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. అంతేకాకుండా ప్లాస్టిక్ బదులుగా పేపర్‌ను వాడాలనే సూచనను ఆయన ఎద్దేవ చేశారు. కాగా.. ట్రంప్ గతంలో కూడా భారత్‌పై ఇవే ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా గత నెల 29న తొలి డిబేట్‌లో పాల్గొన్న ట్రంప్.. వాతావరణ కాలుష్యానికి భారత్, చైనా, రష్యా దేశాలే కారణమన్నారు. 

 

టిక్కెట్లు ర‌ద్దు చేసుకోండి.. డ‌బ్బులిస్తం

టిక్కెట్లు ర‌ద్దు చేసుకోండి.. డ‌బ్బులిస్తం

   33 minutes ago


ఇదేంద‌య్యా  ఇది

ఇదేంద‌య్యా ఇది

   3 hours ago


ఈసారి కూడా ట్రంపే గెలిస్తే.. అది అమెరికాకు పెద్ద గుణపాఠం హిల్లరీ క్లింటన్

ఈసారి కూడా ట్రంపే గెలిస్తే.. అది అమెరికాకు పెద్ద గుణపాఠం హిల్లరీ క్లింటన్

   3 hours ago


త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేస్తున్నాము

త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేస్తున్నాము

   20 hours ago


భారత్ కు ఎఫ్‌-18 యుద్ధ విమానాల‌ను అందించనున్న అమెరికా

భారత్ కు ఎఫ్‌-18 యుద్ధ విమానాల‌ను అందించనున్న అమెరికా

   20 hours ago


కశ్మీరు భూములు ఇకపై అందరివీ.. ఎవరైనా కొనొచ్చన్న కేంద్రం

కశ్మీరు భూములు ఇకపై అందరివీ.. ఎవరైనా కొనొచ్చన్న కేంద్రం

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్

కరోనా కేసుల అప్డేట్

   a day ago


అమెరికాతో ఒప్పందం చరిత్రాత్మకం.. రక్షణమంత్రి రాజ్‌నాథ్

అమెరికాతో ఒప్పందం చరిత్రాత్మకం.. రక్షణమంత్రి రాజ్‌నాథ్

   28-10-2020


హిమాల‌యాల్లో భూమి కొంటారా.. బ్యాగులో డ‌బ్బులు స‌ర్దుకోండి

హిమాల‌యాల్లో భూమి కొంటారా.. బ్యాగులో డ‌బ్బులు స‌ర్దుకోండి

   28-10-2020


కేసుల తగ్గుదల తుపానుకు ముందు ప్రశాంతతే.. ముంచుకొస్తున్న సెకండ్ వేవ్

కేసుల తగ్గుదల తుపానుకు ముందు ప్రశాంతతే.. ముంచుకొస్తున్న సెకండ్ వేవ్

   27-10-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle