భర్తకు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు తల్లి
16-01-202116-01-2021 13:33:25 IST
2021-01-16T08:03:25.338Z16-01-2021 2021-01-16T08:03:20.389Z - - 09-03-2021

ఈ ఫేస్ తెలిసే ఉంటుంది. పూర్తిగా తెలీక పోయినా.. టైటిల్ చూడగానే అర్దం అయ్యే ఉంటుంది కదా. ఔ ఔ ఆమే.. ఈమే. లాస్ట్ ఇయర్ జూలై టైంలో పెద్ద వైరల్ అయిపోయింది ఈ లేడీ. అంతేగా మరి. మొగుడ్ని వదిలేసి కొడుకుని పెళ్లి చేసుకుంటే వైరల్ కాక ఏముంది చెప్పండి. అందుకే.. అప్పుడు అంత వైరల్ అయింది. ఏడాది కూడా కాకముందే.. ఇప్పుడు అప్డేట్ వచ్చింది. తల్లైంది. మొగుడి కొడుకుతో ఇప్పుడు కొడుకునో కూతుర్నో కనడానికి రెడీ అవుతోంది.
అయితే.. ఆమె మొగుడి కొడుకే తప్ప.. సొంత కొడుకు కాదులే. ఇది కాస్త రిలీఫే. సొంత కొడుకు అయితే.. గుండె ఆగి చచ్చే వాళ్లం. అదేంటో పాపం.. తండ్రిని పెళ్లి చేసుకుని.. ఆయన కొడుకుపై లవ్ లో పడింది. ఇక ప్రేమ చిగురిస్తే అది ఎంత దూరం అయినా వెళ్తుంది కదా. అందుకే.. మొగుడ్ని వదిలేసి.. ఆయన కొడుకుని పెళ్లి చేసుకుంది. ఒకే ఇంట్లో రెండు సార్లు కోడలిగా అడుగు పెట్టింది. ఒకే ఇంట్లో ఇద్దరికి పెళ్లాం అయింది. ఇప్పుడు అదే ఇంట్లోని రెండో మొగుడైన కొడుక్కి తల్లి కాబోతుంది. అదీ మ్యాటర్.
ఈమె పేరు మరీనా. ఉండేది రష్యా. ఏజ్ 35, పెళ్లి చేసుకున్న వ్యక్తి వయసు.. 45. పదేళ్ల కిందట పెళ్లి చేసుకుంది. అప్పటికే ఆయనకి 10 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు. అయినా.. కాపురం మంచిగానే సాగింది. మొగుడి కొడుకుని ప్రేమగా చూసుకునేది. ఇద్దరికీ మంచి ప్రేమ పెరిగింది. తర్వాత తర్వాత మొగుడితే మనస్పర్థలు వచ్చాయి. మనకి కుదర్దులే అనుకుని మొగుడ్ని వదిలేసింది. కొన్నాళ్లు ఒంటరిగానే గడిపింది. కానీ.. పదేళ్ల పాటు మరీనాతో పెరిగిన కొడుకు ఆమెను వదిలి ఉండలేకపోయాడు. అప్పటికే కొడుక్కి కూడా ఇరవై ఏళ్లు వచ్చాయి కదా. ఇక వాళ్లిద్దరి ఫ్రెండ్షిప్ తర్వాత కూడా కంటిన్యూ అయింది. తర్వాత తర్వాత.. ఆ పిల్లాడిపై తన ఇష్టాన్ని బయటపెట్టింది మరీనా. అంతే.. ఆ 20 ఏళ్ల కుర్రాడు కూడా. నాకు ఓకే అనేశాడు.
ఆ విషయాన్ని వాళ్లిద్దరు బయటపెట్టారు. తన తండ్రికి ఆ కొడుకు చెప్పాడు. తన మాజీ మొగుడికి ఆమె కూడా చెప్పేసింది. పాపం ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి. తన భార్యగా ఇంటికి వచ్చిన తన పెళ్లాం.. ఇప్పుడు తనని వదిలేసి.. మళ్లీ తన కోడలిగా ఇంటికి రాబోతుంది అని తెలిసి ఫీల్ అయ్యాడు. అయితేనేం.. మీరు ఇద్దరూ ఇష్టపడితే నాకేంటి ప్రాబ్లమ్ అనే ఓకే చేశాడు. అది అప్పటి పెళ్లి కత. ఇప్పుడు ఇది ప్రగ్నెంట్ కథ. ఈ కొత్త జంట ఇప్పుడు మళ్లీ ఇంకాస్త ఆనందంలోకి జారుకుంది. మరీనా తల్లి కావడంతో ఆ ఆనందాన్ని అందరితో పంచుకుంది మరీనా. మరీనా అంటే.. రష్యాలో ఓ సెలబ్రిటీ. మామూలుగానే తను సెలబ్రిటీ. ఇన్ స్టాలో.. ఐదారు లక్షల మంది పాలోవర్స్ ఉన్నారు. ఈ విషయం తెలిశాక.. ఇంకాస్త పాపులర్ అయింది. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయింది.

వ్యాక్సిన్ పాలసీకి భారత్ కట్టుబడింది.. IMF చీప్ గీతా గోపీనాథ్ ప్రశంస
2 hours ago

ఇంతకూ ఆ 5 కోట్లు నాకెవరిచ్చారబ్బా... తాప్సీ బిగ్ జోక్
4 hours ago

అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని కోరిన మహిళా ఎంపీ
18 hours ago

73 ఏళ్ల పెద్దాయనకు పెళ్లి మోజు.. కోటి 30 లక్షలతో అమ్మాయి జంప్
18 hours ago

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,599 మందికి కరోనా
08-03-2021

ప్రపంచానికి భారత్ ఇచ్చిన వరం వ్యాక్సిన్లు.. అమెరికా సైంటిస్టు ప్రశంసలు
08-03-2021

ఈ ఏడాదికి.. నారీ వారియర్ గా నామకరణం చేద్దాం
08-03-2021

దీదీపై మోదీ సెటైర్లు..!
07-03-2021

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,711 మందికి కరోనా..!
07-03-2021

కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు... ఐటీదాడులపై తాప్సీ
07-03-2021
ఇంకా