newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

కొవ్యాక్సిన్ సరఫరాలు మొదలు... నేరుగా 14 రాష్ట్రాలకు అందనున్న వ్యాక్సిన్

12-05-202112-05-2021 07:15:05 IST
Updated On 12-05-2021 10:13:20 ISTUpdated On 12-05-20212021-05-12T01:45:05.009Z11-05-2021 2021-05-11T16:38:41.264Z - 2021-05-12T04:43:20.486Z - 12-05-2021

కొవ్యాక్సిన్ సరఫరాలు మొదలు... నేరుగా 14 రాష్ట్రాలకు అందనున్న వ్యాక్సిన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్: కరోనా వైరస్ ను అంతం చేయడంలో శక్తివంతంగా పనిచేస్తున్న కొవ్యాక్సిన్ సరఫరాలను 14 రాష్ట్రాలకు నేరుగానే అందించేందుకు భారత్ బయోటెక్ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. భారత ప్రభుత్వం నుంచి తమకు అందిన దరఖాస్తుల ఆధారంగానే ఈ ప్రత్యక్ష సరఫరాలను చేపట్టామని వెల్లడించింది. ఈ సరఫరాలను అందుకుంటున్న రాష్ట్రాలలో ఆంద్ర ప్రదేశ్, తెలంగాణ, అస్సాం, ఛత్తీస్ గఢ్, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు ఉన్నాయి.

వ్యాక్సిన్ లభ్యతను బట్టి ఈ రాష్ట్రాలకు నిరంతరం వాటిని సరఫరా చేస్తామని భారత్ బయోటెక్ సంస్థాపకులు సుచిత్ర ఎల్లా తెలిపారు. అయితే ఎంతమేరకు ఈ రాష్ట్రాలకు కొవ్యాక్సిన్ ను అందించబోతున్నామన్న వివరాలను వెల్లడించలేదు. కొవ్యాక్సిన్ ఒక్కొక్క డోసుకు 600 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తున్నట్లు భారత్ బయోటెక్ ఇప్పటికే ప్రకటించింది. అయితే సీరం సంస్థ కోవై షీల్డ్ ను 300 రూపాయలకే అందించడంతో కొవ్యాక్సిన్ రేటును కూడా భారత్ బయోటెక్ 400 రూపాయలకు తగ్గించింది.

క‌రోనా మ‌రో 20 రోజుల్లో త‌గ్గుతుందంట‌లే..

ప్రజలకు అత్యవసరమైన ఈ రెండు వ్యాక్సిన్ల ధరలలో తీవ్ర తేడాలు ఉండటం వల్ల రాజకీయంగా దుమారం రేగింది. దాంతో కేంద్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు ఈ రెండు సంస్థలు వ్యాక్సిన్ డోసు రేటును తగ్గించవలసి వచ్చింది. భారత్ లో టీకాల కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఈ రెండు సంస్థలు కూడా డోసును 150 రూపాయలకే కేంద్రానికి సరఫరా చేస్తున్నాయి. ఇదే రేటుకు భారత్ బయోటెక్ కేంద్రానికి తన సరఫరాలను కొనసాగించే అవకాశం ఉన్నా దీనిని 400 రూపాయలకు పెంచాలని సీరం సంస్థ డిమాండ్ చేస్తోంది.

ఇప్పటికే ఈ రెండు సంస్థలు కూడా తమ ఉత్పత్తులలో 50 శాతాన్ని కేంద్రానికే సరఫరా చేస్తామని ప్రకటించాయి. వ్యాక్సిన్ల కొరత చాలా తీవ్రంగా ఉన్న దృష్ట్యా కొవ్యాక్సిన్ సరఫరాలను భారత్ బయోటెక్ మళ్ళీ ప్రారంభించడం కొంత ఊరటగా భావిస్తున్నారు. పలు రాష్ట్రాలు కూడా ఉచితంగానే టీకాలు వేయడానికి ముందుకు రావడంతో ఈ వ్యాక్సిన్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. మొదట ఏ వ్యాక్సిన్ అయితే వేసుకున్నారో రెండో డోసు కూడా అదే వ్యాక్సిన్ వేసుకోవాలనే నిబంధన ఉండటం వల్ల వీటికి డిమాండ్ పెరిగింది. గత కొన్ని రోజులుగా టీకాల కార్యక్రమం కొనసాగుతున్నా ఇంకా కోట్లాది మందికి మొదటి డోసునే  వేసుకోలేని పరిస్థితి ఉంది. వ్యాక్సిన్ల లభ్యత పెరిగితే ఈ సమస్య కొంతైనా తీరే అవకాశం ఉంది.  

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   11 minutes ago


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   8 hours ago


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   a day ago


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

   21-07-2021


Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

   20-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle