newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

08-04-202108-04-2021 15:14:45 IST
2021-04-08T09:44:45.530Z08-04-2021 2021-04-08T09:44:41.967Z - - 20-04-2021

డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కాంట్రాక్టర్ల నుంచి డబ్బు వసూలు చేయాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చారని సస్పెండైన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే ఆరోపించారు. పైగా సస్పెన్షన్‌లో ఉన్న తనను రెండు కోట్ల రూపాయలు చెల్లిస్తే తిరిగి పోస్టింగ్ ఇప్పిస్తానని కూడా మంత్రి చెప్పారంటూ సచిన్ సంచలన వ్యాఖ్య చేశారు. దీంతో మహారాష్ట్ర మాజీ హోంమంత్రిపై ముంబై మాజీ పోలిస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణల వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లయింది.

2004 మార్చిలో సస్పెండ్ అయిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు సచిన్ వాజే 2020 జూన్ 6న తిరిగి విధుల్లో చేరారు. అయితే తాను తిరిగి పోలీసు శాఖలో చేరడం పట్ల ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యతిరేకించి తిరిగి తనను సస్పెండ్ చేయాలని కోరినట్లుగా వాజే కోర్టుముందు తెలిపారు. ఈ సందర్భంలోనే 2 కోట్ల రూపాయలు చెల్లిస్తే శరద్ పవార్‍ను ఒప్పించి తిరిగి పోలీసు శాఖలో చేరడానికి ప్రయత్నిస్తానని హోమంత్రి ప్రతిపాదించారని వాజే తెలిపారు. అంత డబ్బు చెల్లించలేనని తాను అశక్తత తెలుపగా తర్వాతే డబ్బు చెల్లించాలని అనిల్ కోరినట్లు పేర్కొన్నారు.

2020 అక్టోబర్ నెలలో సహ్యాద్రి గెస్ట్ హౌస్‌కి హోంమంత్రి అనిల్ నన్ను పిలిపించారు. ముంబైలోని 1650 బార్లు, రెస్టారెంట్ల నుంచి తలొక మూడున్నర లక్షల రూపాయల మేరకు వసూలు చేసి తనకు ఇవ్వాలని మంత్రి కోరారు. అయితే ముంబైలో 200 బార్లు మాత్రమే ఉన్నాయని, అంత మొత్తం వసూలు చేయడం తనవల్ల కాదని చెప్పానని వాజే కోర్టుకు విన్నవించారు.

అలాగే సయిఫీ బుర్హానీ అప్‌లిఫ్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ కేసు విచారణను మూసివేసేందుకు రూ.50 కోట్లు ఆ ట్రస్టు సభ్యుల నుంచి వసూలు చేయాలని టార్గెట్‌ పెట్టగా అటువంటి పనులను చేయలేనని తప్పుకున్నట్లు పేర్కొన్నారు. కాగా అవినీతి ఆరోపణలున్న 50 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.2 కోట్లు వసూలు చేసి ఇవ్వాలని మరో మంత్రి అనిల్‌ పరబ్‌ తనను కోరారని తెలిపారు. 

హోంమంత్రి వంద కోట్లు వసూలు చేసి ఇవ్వాలని చెప్పిన విషయాన్ని అప్పటి పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌కు కూడా తెలిపానని వాజే చెప్పారు. రాష్ట్రంలోని గుట్కా, పొగాకు అక్రమ వ్యాపారుల నుంచి రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ కేబినెట్‌లో సీనియర్‌ మంత్రి సన్నిహితుడినంటూ దర్శన్‌ ఘోడావత్‌ అనే వ్యక్తి సంప్రదించగా దానికి కూడా తాను  నిరాకరించినట్లు తెలిపారు. 

కోట్ల కొద్దీ డబ్బులు వసూలు చేయాలంటూ తనను హోంమంత్రి ఒత్తిడికి గురిచేస్తున్నారని అప్పటి ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్‌ దృష్టికి తీసుకుపోయానని కూడా వాజే తెలిపారు. ఎవరినుంచి కూడా అక్రమ డబ్బులు వసూలు చేయవద్దని కమిషనర్ తనకు సూచించారని చెప్పారు. సమీప భవిష్యత్తులోనే తప్పుడు వివాదంలోకి తనను లాగే ప్రమాదం ఉందని కూడా కమిషనర్‌కి తెలిపానన్నారు.

అయితే ఈ ఆరోపణలన్నింటినీ ఖండిస్తూ వచ్చిన హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ చివరకు ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయాలని కోర్టు ఆదేశించడంతో విధిలేక తన పదవికి రాజీనామా చేశారు.

మహారాష్ట్ర హోంమంతిపై సీబీఐ విచారణ.. అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా!

ఢిల్లీలో లాక్ డౌన్.. కేజ్రీవాల్ కీలక ప్రకటన

ఢిల్లీలో లాక్ డౌన్.. కేజ్రీవాల్ కీలక ప్రకటన

   15 hours ago


విమాన సర్విసులను ఆపేసిన హాంకాంగ్

విమాన సర్విసులను ఆపేసిన హాంకాంగ్

   16 hours ago


‘ఇంకా ఎంతో చేయవచ్చు’ కోవిడ్ పై మోడీకి మన్మోహన్ లేఖ

‘ఇంకా ఎంతో చేయవచ్చు’ కోవిడ్ పై మోడీకి మన్మోహన్ లేఖ

   18 hours ago


సిద్ధమవుతున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు

సిద్ధమవుతున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు

   19 hours ago


మళ్ళీ లాక్ డౌన్ వద్దు.. రాష్ట్రాలకు ఫిక్కీ లేఖ

మళ్ళీ లాక్ డౌన్ వద్దు.. రాష్ట్రాలకు ఫిక్కీ లేఖ

   17-04-2021


18 ఏళ్ళు దాటితే కోవిడ్ టీకా వేయాలి.. సుప్రీంకోర్టులో పిటీషన్

18 ఏళ్ళు దాటితే కోవిడ్ టీకా వేయాలి.. సుప్రీంకోర్టులో పిటీషన్

   17-04-2021


నీరవ్ మోడీ అప్పగింతకు లైన్ క్లియర్..  యు.కె హోమ్ మంత్రి

నీరవ్ మోడీ అప్పగింతకు లైన్ క్లియర్.. యు.కె హోమ్ మంత్రి

   17-04-2021


రైలు సర్వీసులు యధాతథo.. రైల్వేబోర్డు చైర్మన్ వెల్లడి

రైలు సర్వీసులు యధాతథo.. రైల్వేబోర్డు చైర్మన్ వెల్లడి

   17-04-2021


భారత్ లో వ్యాక్సిన్ సీన్ రివర్స్.. ఆందోళనలో భారత్ పై ఆధారపడ్డ దేశాలు

భారత్ లో వ్యాక్సిన్ సీన్ రివర్స్.. ఆందోళనలో భారత్ పై ఆధారపడ్డ దేశాలు

   16-04-2021


అయోధ్య విరాళాలలో 15వేల చెక్కులు బౌన్స్.. విలువ 22 కోట్లు

అయోధ్య విరాళాలలో 15వేల చెక్కులు బౌన్స్.. విలువ 22 కోట్లు

   16-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle