newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

ఢిల్లీలో ఉచితంగా టీకాలు ప్రకటించిన కేజ్రీవాల్

26-04-202126-04-2021 14:47:44 IST
2021-04-26T09:17:44.988Z26-04-2021 2021-04-26T08:30:37.038Z - - 25-07-2021

ఢిల్లీలో ఉచితంగా టీకాలు ప్రకటించిన కేజ్రీవాల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత కొద్ది రోజులుగా కోవిడ్ మరణాల తీవ్రత, కేసుల వ్యాప్తి, ఆక్సిజన్ కొరత వంటి సమస్యలతో తల్లడిల్లిన ఢిల్లీ సర్కార్ ఇప్పుడు ఈ మహమ్మారిని మట్టుబెట్టే చర్యలను ముమ్మరం చేసింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ మరో వారం పాటు పొడిగించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఉచితంగానే కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించారు. 13.4 మిలియన్ వ్యాక్సినేషన్ డోసులను ఇందుకోసం సమకూర్చుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఢిల్లీలో 18 సంవత్సరాల వయసు దాటినా వారందరికీ ఉచితంగానే ఈ మందును అందించాలంటే భారీ పరిమాణంలో దీనిని సమకూర్చుకోవలసి అవసరం ఉందని కేజ్రీవాల్ తెలిపారు.   

కొత్త కేసులు రాకుండా ఉండాలంటే వ్యాధి వ్యాప్తిని నిరోధించడం ఒక్కటే మార్గమని పేర్కొన్న కేజ్రీవాల్, ఇందులో భాగంగానే భారీఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ వైరస్ భయానక పరిస్థితులను సృష్టిస్తున్నందున వేల సంఖ్యలో మరణాలకు దారితీసినందున ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించామని అన్నారు. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ డోసులను సమకూర్చుకుంటామని ప్రజలందరికీ టీకాలు ఉచితంగా వేస్తామని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తే కోవిడ్ వైరస్ ఓ మామూలు వ్యాధిగానే మారిపోతుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.   

దేశంలో రోజువారీగా కోవిడ్ కేసులు పెరిగిపోవడం అన్ని వయసుల వారికీ ఈ వ్యాక్సిన్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ రేటు సర్వత్రా ఆందోళన కలిగించింది. కేంద్రానికి, రాష్ట్రాలకు, ప్రయివేటు సంస్థలకు సరఫరా చేసే మందు రేటులో భారీగానే వ్యత్యాసం ఉండటం వల్ల  కేంద్రపై అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు విరుచుకు పడ్డాయి. దాంతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ధిక భారాన్ని తామే భరించి 18 ఏళ్ళు దాటిన వారికి ఉచితంగానే వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించాయి.   

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తలమునకలైన మమతా బెనర్జీ ఉచిత వ్యాక్సినేషన్ ప్రకటన చేసి అన్ని రాష్ట్రాలను కదిలించారు. ఆ తరువాత ఒకటొకటిగా ఉచిత టీకాలు వేయడానికి అనేక రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. వచ్చే నెల ఒకటవ తేదీ నుంచే మూడవ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ అత్యంత భారీగా ప్రారంభమవుతున్న దృష్ట్యా అందుకు అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ మార్గ నిర్దేషణతో ముందుకు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి నమోదు ప్రక్రియను కూడా కేంద్రం ప్రారంభించింది. జనవరి 16న తొలి డోసు టీకాల కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు ఈ మూడవ దశ కార్యక్రమం ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైనది. 

 

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   2 hours ago


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   9 hours ago


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

   21-07-2021


Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

   20-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle