newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

13-05-202113-05-2021 14:13:05 IST
Updated On 13-05-2021 14:34:57 ISTUpdated On 13-05-20212021-05-13T08:43:05.068Z13-05-2021 2021-05-13T08:42:48.117Z - 2021-05-13T09:04:57.648Z - 13-05-2021

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఢిల్లీ: నిన్న మొన్నటి వరకు  కోవిడ్ రోగులకు ఆక్సిజన్ లేక అల్లాడిన ఢిల్లీ ఇప్పుడు తమ కోటా వాటాను ఇతర రాష్ట్రాలకు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.  ఢిల్లీలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 14 శాతానికి దిగువనే ఉందని కేజ్రీవాల్ సర్కార్ తెలిపింది. దీనితో ఆసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్య కూడా బాగా తగ్గడంతో ఇప్పుడు తమవద్ద మిగులు ఆక్సిజన్ ఉందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెబుతున్నారు. 

ఒక దశలో తమకు కేసుల తీవ్రత దృష్ట్యా 700 మెట్రిక్ టన్నులకు పైగా ఆక్సిజన్ అవసరమయ్యేదని, ఇప్పుడు 582 మెట్రిక్ టన్నుల ఆక్సిజనే  సరిపోతున్నదని ఆయన వివరించారు. తమ వద్ద ఉన్న మిగులు ఆక్సిజన్ ను అవసరంలో ఉన్న రాష్ట్రాలకు మళ్లించవచ్చునని కేంద్రానికి స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. పక్షం రోజుల క్రితం వరకు ఢిల్లీలో కోవిడ్ కేసులు వరద మాదిరిగానే వెల్లువెత్తాయని, పాజిటివ్ కేసుల సంఖ్య 35 శాతాన్ని దాటి పోయిందని ఆయన ఈ సందర్బంగా గుర్తుచేశారు.

ఇప్పుడు కేసులు తగ్గడం వల్ల ఆక్సిజన్ అవసరం కూడా తగ్గిందని, అవసరంలో ఉన్న ఏ రాష్ట్రానికైనా ఈ మిగులు ఆక్సిజన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక ఆసుపత్రులలో పడకల సమస్య కూడా ఎక్కడా లేదని ఆయన వెల్లడించారు. ఒక దశలో ఆక్సిజన్ సమస్య ఇటు హైకోర్టును, సుప్రీంకోర్టును కూడా కదిలించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీలోని అన్ని ఆసుపత్రులలోనూ ఆక్సిజన్ సమస్యే లేదని, గత 24 గంటల్లో ఏ ఆసుపత్రినుంచి తమకు ఫోన్ రాలేదని తెలిపారు. తాము అవసరంలో ఉన్నప్పుడు ఆక్సిజన్ కోసం కేంద్రాన్ని నిలదీసిన మాట నిజమేనని, ఇప్పుడు ఆ అవసరం తీరి మిగులు ఆక్సిజన్ ఉన్నందున ఓ బాధ్యతాయుత ప్రభుత్వంగా దీనిని ఇతర రాష్ట్రాలకు ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు.

దేశంలో అనేక రాష్ట్రాలలో ఆక్సిజన్ సమస్య తీవ్రంగా ఉన్నందున తమ మిగులు ఆక్సిజన్ వాటికి ఎంతైనా ఉపయోగపడుతుందని సిసోడియా అన్నారు. దేశంలో వ్యాక్సిన్ల కొరతకు ప్రధాన కారణం ప్రజల అవసరాలను పట్టించుకోకుండా 6.5 కోట్ల వ్యాక్సిన్లను అనాలోచితంగా ఇతర దేశాలకు ఎగుమతి చేయడమేనని ఆయన ఆరోపించారు. దేశీయ కంపెనీ సహకారంతోనే వ్యాక్సిన్ ఉత్పత్తిని డిమాండుకు తగ్గట్టుగా ప్రభుత్వం పెంచగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీనితో పాటు ఇతర దేశాలు ఆమోదించిన వ్యాక్సిన్లను కూడా దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.  

అంతా కేంద్ర పెత్తనం వల్లే ! ఢిల్లీకి కొవ్యాక్సిన్ సరఫరా నిరాకరణపై సిసోడియా

కోవిడ్ -19: అంబులెన్స్‌పై జిఎస్‌టి 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు: నిర్మలా సీతారామన్

కోవిడ్ -19: అంబులెన్స్‌పై జిఎస్‌టి 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు: నిర్మలా సీతారామన్

   6 minutes ago


అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

   an hour ago


బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   5 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   21 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle