newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఢిల్లీలో లాక్ డౌన్.. కేజ్రీవాల్ కీలక ప్రకటన

19-04-202119-04-2021 15:22:22 IST
2021-04-19T09:52:22.762Z19-04-2021 2021-04-19T09:52:14.709Z - - 15-05-2021

ఢిల్లీలో లాక్ డౌన్.. కేజ్రీవాల్ కీలక ప్రకటన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోవడంతో సోమవారం నుంచి 26వ తేదీ సోమవారం వరకు లాక్ డౌన్ విధిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు వేల సంఖ్యలోనే పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 23 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. పెరుగుతున్న కేసులకు సరిపడా ఆసుపత్రుల్లో పడకల సంఖ్య లేకపోవడం వల్ల పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. రోజుకు 25 వేల చొప్పున కేసులు పెరిగితే పడకల కొరత వల్ల వ్యవస్థ కుప్పకూలుతుంది ఆయన తెలిపారు. కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు .

ఇప్పటికే రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థపై చాలా తీవ్ర ప్రభావమే పడిందని, అన్ని విధాలుగా తీవ్ర వత్తిడికి లోనవుతోందని కేజ్రీవాల్ అన్నారు. ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలకుండా ఉండాలంటే తక్షణ ప్రాతిపదికన అత్యవసర చర్యలు తీసుకోవలసి ఉంటుందని, కఠినంగా వ్యవహరించక తప్పదని కేజ్రీవాల్ అన్నారు. లాక్ డౌన్ విధించినప్పటికీ అత్యవసర సర్వీసులు, ఆహార సేవలు, వైద్య సేవలు యథాతథంగా కొనసాగుతాయని అన్నారు. యాభైకి మించి అతిధులు లేకుండా పెళ్లిళ్లు చేసుకోవచ్చునని, అందుకు అవసరమైన పాసులు ఇస్తామని ఆయన తెలిపారు.

ఆదివారం నాడు ఢిల్లీలో పెరిగిన కేసుల తీవ్రతతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ప్రతి మూడవ శాంపిల్ పాజిటివ్ కావడంతో ఇప్పటికే వారాంతపు కర్ఫ్యూ ను ఢిల్లీలో అమలు చేస్తున్నారు. ఒక ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్నిచోట్లా దాదాపు ఇదేరకమైన పరిస్థితి తలెత్తడం గమనార్హం. ఢిల్లీలో అన్ని ఆసుపత్రుల్లోనూ ఐ సి యు పడకలు వందకు తక్కువగా అందుబాటులో ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితి గంట గంటకూ తీవ్రమవుతున్నందున తక్షణ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నడిపే ఆసుపత్రులలో పడకల సంఖ్య పెంచాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కు కేజ్రీవాల్ లేఖలు రాశారు. అలాగే ఎలాంటి ఆటంకం లేకుండా ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరారు.

రాష్ట్రంలో ఆక్సిజన్ తో పాటు ఆసుపత్రులలో పడకల కొరత తీవ్రంగా ఉందని, కేంద్ర ప్రభుత్వ ఆసుపతులలో ఏడు వేల పడకలను కోవిడ్ రోగులకు ప్రత్యేకించాలని మోడీకి రాసిన లేఖ కేజ్రీవాల్ కోరారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న 10వేల పడకలలో కేవలం 1800 పడకలను మాత్రమే కోవిడ్ రోగులకు ప్రత్యేకించారని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని నర్సింగ్ హోమ్ లు ప్రయివేటు ఆసుపత్రులలో 80 శాతం ఐ సి యు, వార్డు పడకలను కరోనా బాధితులకు కేటాయించాలని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.  

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

   10 hours ago


నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   16 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   14-05-2021


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   14-05-2021


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13-05-2021


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle