newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

10-04-202110-04-2021 09:58:16 IST
2021-04-10T04:28:16.391Z10-04-2021 2021-04-10T04:27:21.868Z - - 15-05-2021

ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆహా.. వాడి పొలంలో ముత్యాలు పండాయి రా.. ర‌త్నాలు రాసుల్లా  ప‌డుతున్నాయిరా అనుకుంటాం. కానీ.. అదంతా ఒక పోలిక మాత్ర‌మే.  నిజంగా మాట్లాడుకుంటే మాత్రం.. ముత్యాలు పండ‌వు.. ర‌త్నాలు రాసుల్లా ప‌డ‌వు. కానీ.. ర‌త్నాల విష‌యం ప‌క్క‌న పెడితే.. ముత్యాలు మాత్రం పండించొచ్చు అంటున్నాడు.. బీహార్ లోని ఓ కుర్రాడు.

వ్య‌వ‌సాయం అంటే.. వ‌రి ప‌త్తి మిర్చి ప‌సుపు సాగే కాదు. చాలా ఉన్న‌య్. అందుకే.. చేప‌లు ఉత్ప‌త్తి చేసే వాళ్ల‌ని కూడా రైతులు అనే అంటారు.  ఉప్పు ఉత్ప‌త్తి చేసే వాళ్ల‌ని కూడా ఉప్పు రైతులు అంటారు.  అలాగే.. ఇత‌ను ముత్యాల రైతు అన‌మాట‌.  పొలంలో ఏకంగా ముత్యాల్నే పండిస్తున్నాడు. చూస్తున్నారు క‌దా. ఏకంగా ఎక‌రం పొలంలో  30 వేల ముత్యాలు పండిస్తున్నాడు. బీహార్ లోని చంపారన్ జిల్లా ముగేర‌న్ గ్రామ నివాసి ఇత‌ను. పేరు నిటిల్ భ‌రద్వాజ్. సాఫ్ట్ వేర్ చ‌దువులు చ‌దివాడ‌ట‌. వేల‌కి వేలు సంపాదించే జీతం తెచ్చుకుంటున్నాడ‌‌. కానీ.. ఏం ఉద్యోగాలు రా నాయ‌నా.. ఒక‌డి కింద ప‌ని చేసేది ఏంటి అనుకున్నాడు. ఊరెళ్దాం మామా అనుకున్నాడట‌. కానీ.. రాలేడు క‌దా. అదే టైంలో.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ముత్యాల సాగు గురించి తెలుసుకున్నాడు. అంతే. బ్యాగేసుకుని మ‌ధ్య ప్ర‌దేశ్ వెళ్లాడు. ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ముత్యాల సాగు ద‌గ్గ‌ర ప‌ని చేశాడు. అక్క‌డ ప‌ని నేర్చుకున్నాడు. చ‌లో అనుకున్నాడు.. బ్యాగేసుకుని సొంతూరు బీహార్ వెళ్లాడు. పొలంలో చిన్న చెరువు, కుంట లాంటిది త‌యారుచేసుకుని.. ముందుగా 25 వేల పెట్టుబ‌డితో..400 ముత్యాలు పెంచాడు. పాతిక వేల‌కి 75 వేలు వ‌చ్చాయంట‌. వాహ్ సూప‌ర్ అనుకున్నాడు. అలా అలా పెంచుతూ పోయాడు. త‌ర్వాత త‌ర్వాత ఎక‌రం పొలంలో.. ఏకంగా 30 వేల ముత్యాలు పెంచుతున్నాడు. ఒక్కో ఆల్చిప్ప‌కి..40 రూపాయ‌ల పెట్టుబ‌డి పెడితే.. త‌క్కువ‌లో త‌క్కువ 150 రూపాయ‌లు వ‌స్తాయ‌ట‌.  మంచిగా ఉంటే.. 200 కూడా వ‌స్తాయ‌ట‌. అంటే.. రూపాయి పెడితే నాలుగు రూపాయ‌లు వ‌స్తున్న‌య్. త్రీ టైమ్స్ ఎక్కువ‌.  ఇంత‌కంటే  మంచి పంట ఇంకేం ఉంటుంది  చెప్పండి. ఎవ‌రైనా వ‌స్తే రండి.. నేను ట్రైనింగ్ ఇస్తా అంటున్నాడు.

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

   10 hours ago


నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   16 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   a day ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   14-05-2021


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13-05-2021


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle