newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

మొదట కోవిద్ వ్యాక్సిన్లు వేసేది వారికే..!

05-10-202005-10-2020 11:27:11 IST
Updated On 05-10-2020 11:52:27 ISTUpdated On 05-10-20202020-10-05T05:57:11.768Z05-10-2020 2020-10-05T05:56:59.440Z - 2020-10-05T06:22:27.425Z - 05-10-2020

మొదట కోవిద్ వ్యాక్సిన్లు వేసేది వారికే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కరోనా వ్యాక్సిన్ ను ఎన్నో సంస్థలు అభివృద్ధి చేస్తూ ఉన్నాయి. వివిధ దేశాల్లో వివిధ ఫార్మా కంపెనీలు కోవిద్ వ్యాక్సిన్ ను రూపొందించే పనుల్లో నిమగ్నమయ్యాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా మీద కూడా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ వ్యాక్సిన్ ఇంకో ఆరు  నెలల్లోపు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. టీకా అందుబాటులోకి రాగానే వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నారు. తొలుత 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, ఆ తర్వాత అత్యంత ముప్పు కలిగిన వారికి, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న యువకులకు వ్యాక్సిన్ ఇవ్వడం జరగనుంది.

ఈ విషయాన్ని ప్రభుత్వం తెలిపినట్టు బ్రిటన్ మీడియా తెలిపింది. వారందరికీ ఇచ్చిన తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి, యువతకు టీకా ఇవ్వనున్నట్టు, మొత్తానికి ఆరు నెలల్లోపే వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్నట్టు తెలిపింది. ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయి.. క్రిస్మస్ నాటికి అనుమతులు వచ్చే అవకాశం రాబోతోంది. 

భారత్‌లో గత 24 గంటల్లో 74,442 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 66,23,816 కి చేరింది. 24 గంట‌ల సమయంలో 903 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,02,685 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 55,86,704 మంది కోలుకున్నారు. 9,34,427 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.    


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle