కరోనా టీకాపై ఆంక్షల తొలగింపు.. ఇకపై 24 గంటలూ టీకా
04-03-202104-03-2021 17:03:23 IST
2021-03-04T11:33:23.774Z04-03-2021 2021-03-04T10:42:46.686Z - - 11-04-2021

దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీని వేగవంతం చేయడం కోసం టీకా పంపిణీ వేళలపై ఆంక్షలను తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం పేర్కొంది. ఇంతవరకు నిర్దిష్ట వేళల్లో మాత్రమే కరోనా టీకా వేయించుకోవడానికి దేశప్రజలు టీకా కేంద్రాల వద్దకు రావలసి ఉండేది. దీనివల్ల టీకా పంపిణా కార్యక్రమమే నత్తనడక నడుస్తోందని 45 రోజుల అనుభవం తర్వాత కేంద్రప్రభుత్వం గ్రహించి తదనుగుణంగా టీకా పంపిణీ వేళలపై నిబంధనలను పూర్తిగా ఎత్తివేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయమై బుధవారం నిర్దిష్టంగా ప్రకటన చేసింది. దేశప్రజలు ఇకపై రోజులో ఏ సమయంలోనైనా కరోనా టీకా పొందవచ్చని, తమ వెసులుబాటును బట్టి అనువైన వేళల్లో ప్రజలు టీకా తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. టీకా పంపిణీని మరింత వేగవంతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, సమయం విలువను ప్రధానమంత్రి నరేంద్రమోదీ చక్కగా అర్థం చేసుకున్నారని మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.. ఈ మేరకు ఆయన బుధవారం సాయంత్రం ట్వీట్ చేశారు. ఇక నుంచి ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఏ వేళలోనైనా టీకా పంపిణీ చేయవచ్చని చెప్పారు.. అన్ని ఆస్పత్రుల్లో టీకా వేయడానికి ఉన్న సమయ పరిమితిని ఎత్తివేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆయా ఆసుపత్రుల సామర్థ్యాన్ని బట్టి టీకా పంపిణీ వేళలను నిర్దేశించుకోవాలని సూచించారు. ఈ వేళల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ డ్రైవ్లో పాల్గొన్న అన్ని ఆస్పత్రులు కోవిన్ యాప్, వెబ్సైట్ ద్వారా అనుసంధానం అయ్యాయని తెలిపారు. దీంతో అన్ని ఆస్పత్రుల్లో కోవిడ్ వ్యాక్సిన్ను ప్రజలకు అందించడానికి సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. కోవిన్ పోర్టల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే టీకా అందుబాటులో ఉంటుందని నిబంధన ఏమి లేదని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఆస్పత్రి యాజమాన్యం కోరుకున్న సమయంలో ప్రజలకు టీకాలు అందించే అనుమతి ఉందని తెలిపారు. ఉదయం 8 గంటలకు, రాత్రి 8 గంటలకు కూడా టీకా వేయవచ్చు: మంత్రి వివరణ కోవిన్ పోర్టల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు టీకా వేస్తామనే నిబంధనలు లేవు. ఆసుపత్రులు ఏ సమయంలోనైనా సరే టీకా వేయాలనుకుంటే బేషరతుగా వేయవచ్చు. రాత్రి 8 గంటల సమయంలోనూ ఆసుపత్రులు టీకా వేయవచ్చు. అలాగే ఉదయం 8 గంటలకు కూడా కోవిడ్-19 టీకా కార్యక్రమాన్ని ఆస్పత్రులు మొదలుపెట్టవచ్చు. టీకాలు వేసే షెడ్యూల్, సామర్థ్యం విషయంలో ఆసుపత్రులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటే చాలు అని కేంద్ర ఆరోగ్య మంత్రి స్పష్టత ఇచ్చారు. కరోనా పంపిణీ వేళల్లో వెసులుబాటుకు వీలు కల్పించడానికి మరో కారణం కూడా ఉంది. వ్యాక్సినేషన్ వేసే కేంద్రాల్లో నిర్ణీత వేళల్లో భారీగా జనం గుమికూడకుండా ఉండటానికి కూడా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా టీకా వేసే సమయాన్ని కంపార్ట్మెంట్లుగా విభజించాలని ప్రభుత్వం భావించడం లేదని ఆరోగ్య మంత్రి చెప్పారు. అది ఉదయం కావచ్చు.. మధ్యాహ్నం కావచ్చు. ఆసుపత్రి సామర్థ్యం బట్టి ఏ వేళలోనైనా కరోనా టీకాలు వేయవచ్చు. నిర్దిష్ట వేళల్లోనే టీకాలు వేస్తున్నప్పుడు కొన్ని కేంద్రాల్లో జనం గుంపులు గుంపులుగా గుమికూడుతున్నట్లు అభిప్రాయం వచ్చింది. అందుకే టీకా కేంద్రాల్లో రద్దీ లేకుండా చేయడానికి మొత్తం టీకా పంపిణీ వ్యవస్థలోనే మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి హర్షవర్ధన్ వివరించారు. గత రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా 5.94 లక్షలమంది ప్రజలు టీకా వేయించుకున్నారు. వీరిలో 60 సంవత్సరాలు పైబడిన వారు 5.22 లక్షలమంది, 45 నుంచి 60 ఏళ్ల వయసులో పలు వ్యాధులకు గురైనవారు 71,896 మంది మంగళ, బుధవారాల్లో కోవిడ్-19 టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇంతవరకు దేశవ్యాప్తంగా 1.59 కోట్ల మంది ప్రజలు టీకా వేయించుకున్నట్లు సమాచారం.

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన
9 hours ago

ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు
13 hours ago

టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ
19 hours ago

ముత్యాలు పండాయి అనడం కాదు.. నిజంగానే పండిస్తే మస్తు లాభాలు
20 hours ago

ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్లో కోరలు చాస్తున్న కరోనా
09-04-2021

వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ
09-04-2021

అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం
09-04-2021

డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే
08-04-2021

పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం
08-04-2021

అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ
08-04-2021
ఇంకా