ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు
16-01-202116-01-2021 11:02:03 IST
2021-01-16T05:32:03.245Z16-01-2021 2021-01-16T05:31:57.360Z - - 27-02-2021

నేటినుంచి కోవిడ్ నిరోధక వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న సందర్భంగా అటు ప్రభుత్వమూ, ఇటు సైంటిస్టులూ కీలకమైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య సమయం 28 రోజుల కంటే ఎక్కువగా ఉంటేనే టీకా మరింత సమర్థంగా పనిచేస్తుందని అదార్ పూనవల్లాస్ సీరమ్ సంస్థ సీనియర్ శాస్త్రవేత్త పేర్కొన్నారు. భారత్‌లో నేటినుంచి వినియోగంలోకి రానున్న రెండు కోవిడ్ టీకాలు సీరమ్ సంస్థ రూపొందించిన కోవిషీల్డ్, భారత్ బయోటిక్ రూపొందించిన కోవాక్సిన్ లను 28 రోజుల వ్యవధిలో రెండు డోసుల చొప్పున వేయనున్నారు. అంటే ఒక డోసుకు మరొక డోసుకు కచ్చితంగా 28 రోజుల వ్యవధిని పాటించనున్నారు. అయితే రెండు డోసుల మధ్య 28 రోజుల కంటే ఎక్కువ వ్యవధి పాటిస్తే కోవిషీల్డ్ ఫలితం మరింత మెరుగ్గా ఉంటుందని సీరమ్ కార్యనిర్వాహక డైరెక్టర్ సురేష్ జాదవ్ పేర్కొన్నారు. నాలుగువారాల వ్యవధిలో రెండు డోసులను ఇస్తే అది కూడా మంచి రక్షణనే ఇస్తుంది కానీ దాని ఫలితం 70 నుంచి 80 శాతం వరకు మాత్రమే ఉంటుంది. కానైతే రెండు డోసుల మధ్య వ్యవధి ఆరు వారాలు, ఎనిమిదివారాలు లేక 10 వారాల వరకు ఉంటే ఫలితం అద్భుతంగా ఉంటుందని డాక్టర్ జాదవ్ తెలిపారు. క్లినికల్ ట్రయల్ మూడో దశలో డోసుకు డోసుకు మధ్య 28 రోజుల గ్యాప్ ఇచ్చి ప్రయోగించాము కాబట్టి ఇదే ప్రామాణిక వ్యవధిగా ఉంటోంది కాని రెండు డోసును అంత త్వరగా తీసుకుంటే టీకా నుంచి 70 శాతం రక్షణ మాత్రమే ఉంటుందని జాదవ్ చెప్పారు. కాబట్టి దీర్ఘకాలంలో కోవిడ్ టీకానుంచి అత్యున్నతంగా రక్షణ పొందాలంటే ఆరు వారాలు లేక ఎనిమిదివారాల వ్యవధిని పాటిస్తే చాలామంచి ఫలితం ఉంటుందని చెప్పారు. అయితే తొలిసారి డోస్ వేసుకున్న వారు తప్పనిసరిగా రెండో డోసును తీసుకోవాలని అప్పుడు మాత్రమే పూర్తి రక్షణ కలుగుతుందని జాదవ్ స్పష్టం చేశారు. కోవిడ్ 19 వైరస్ ఇప్పటికే సోకి స్వస్థత పొందినవారు కూడా వాక్సినేషన్ తీసుకుంటేనే మంచిదని అభిప్రాయపడ్డారు. ఒకసారి కోవిడ్ వైరస్ సోకిన వారికి మళ్లీ రెండోసారి కూడా సోకే అవకాశం ఉంది కాబట్టే అలాంటి వారు కూడా వాక్సిన్ తీసుకుంటేనే మంచిదని చెప్పారు. మరోవిషయం ఏమిటంటే వాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కోవిడ్ వైరస్ తిరిగి వచ్చే అవకాశముందని, అన్ని వైరస్ ఆధారిత వ్యాధుల విషయంలోనూ ఇది సంభవిస్తుందని డాక్టర్ జాదవ్ స్పష్టం చేశారు. అయితే తేడా ఏమిటంటే మీకు ఇన్ఫెక్షన్ వస్తుంది తప్ప వ్యాధి మళ్లీ రాదన్నారు. రెండో సారి మూడోసారి స్వల్పస్థాయిలో లక్షణాలు కనిపించకుండానే వైరస్ సోకుతుంటుందని చెప్పారు. అయితే మొదట ఒక కంపెనీ డోస్ వేసుకుని మరో కంపెనీకి సంబంధించిన వ్యాక్సిన్‌ని రెండో డోసుగా వాడితే ప్రమాదం లేదు కానీ టెక్నాలజీ వేరుగా ఉంటుంది కాబట్టి రిస్క్‌ను తప్పించుకోవడానికి రెండు వ్యాక్సిన్లనూ ఎవరూ తీసుకోరాదని సీరమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జాదవ్ స్పష్టం చేశారు. మరి ప్రభుత్వం మాత్రం ప్రామాణిక వ్యవధిని 28 రోజులుగా మాత్రమే నిర్దేశించింది. మరి వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాక రెండు డోసు తీసుకునే సమయాన్ని రాబోయే రోజుల్లో కేంద్రం మరిన్ని వారాలు పొడిగిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

కరోనా అప్డేట్.. గత 24 గంటల్లో 16,488 మందికి కరోనా
an hour ago

కొరియన్ బ్యాండ్‌పై హోస్ట్ జాతి వివక్షా వ్యాఖ్యలు.. జర్మన్ రేడియో క్షమాపణ
2 hours ago

కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ.. పెరుగుతున్న కరోనా కేసులు
2 hours ago

ఎన్నికల షెడ్యూల్ ఇదే..!
14 hours ago

భారత్ పాక్ కాల్పుల విరమణ.. సూత్రధారి దోవల్
a day ago

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 16,577 మందికి కరోనా..!
21 hours ago

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు బైడెన్ గ్రీన్ సిగ్నల్
a day ago

మోదీ.. ఉద్యోగమివ్వు.. 50 లక్షల ట్వీట్లతో ట్విట్టర్లో ట్రెండింగ్
26-02-2021

టీ చేయకపోతే చావగొడతారా.. భార్య అంటే వస్తువా.. ధ్వజమెత్తిన హైకోర్టు
18 hours ago

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు ఉన్న వాహనం
26-02-2021
ఇంకా