newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భారత్ లో వ్యాక్సిన్ సీన్ రివర్స్.. ఆందోళనలో భారత్ పై ఆధారపడ్డ దేశాలు

16-04-202116-04-2021 16:58:26 IST
Updated On 16-04-2021 17:05:07 ISTUpdated On 16-04-20212021-04-16T11:28:26.676Z16-04-2021 2021-04-16T11:28:23.234Z - 2021-04-16T11:35:07.650Z - 16-04-2021

భారత్ లో వ్యాక్సిన్ సీన్ రివర్స్.. ఆందోళనలో భారత్ పై ఆధారపడ్డ దేశాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిన్నమొన్నటి వరకూ ప్రపంచ దేశాలు అన్నింటికీ కోవిడ్ వ్యాక్సిన్ డొసులను లక్షలాదిగా బహుకరించడమో లేదా అమ్మడమో చేసిన భారత్ కు ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా తాజాగా కోవిడ్ కేసులు దేశవ్యాప్తంగా ప్రబలడంతో సొంత అవసరాలకే ఈ వ్యాక్సిన్లు సరిపోని పరిస్థితిని భారత్ ఎదుర్కొంటోంది. ఒక్కసారిగా కథ అడ్డం తిరగడంతో కోవిడ్ వ్యాక్సిన్ ఎగుమతులను, విక్రయాన్ని భారత్ నిలిపి వేయడంతో ప్రపంచ దేశాలలో ఆందోళన మొదలైంది. నిన్న మొన్నటి వరకూ ఈ వ్యాక్సిన్ ఎగుమతి చేసిన భారత్ కు దాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి తలెత్తడం చాలా చెశాలకు మింగుడు పడటం లేదు.

ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న భారత్ లో ఇప్పుడు ఈ వ్యాక్సిన్ కొరత పెద్ద సమస్యగా మారుతోంది. గురువారం ఒక్క రోజులోనే రెండు లక్షలకు పైగా కోవిడ్ కేసులు తలెత్తడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో భారత్ ఈ వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకుంటున్నది. దేశీయంగానే వ్యాక్సిన్ తయారు చేస్తున్నప్పటికీ కూడా పెరుగుతున్న కేసుల తీవ్రత నేపథ్యంలో వీటి పరిమాణం ఎంత మాత్రం సరిపోవడంలేదు. రోజూవారీ కేసులు పెరగడంతో పాటు ఆసుపత్రులు కూడా క్రిక్కిరిసి పోవడంతో అన్ని విధాలుగా కొరత పరిస్థితిని భారత్ ఎదుర్కొంటున్నది. తక్షణ ప్రాతిపదికన ఈ వ్యాక్సిన్ దిగుమతి చేసుకునే విధంగా నియమాలను సడలించింది. 

గతంలో ఫైజర్ వంటి విదేశీ మందుల కంపెనీలను తిరస్కరించిన భారత్ కు ఇప్పుడు దిగుమతులు శరణ్యం కావడంతో మార్గాంతరంపై దృష్టి పెట్టింది. భారత్ కు చిరకాల మిత్ర దేశమైన రష్యా కు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఒక్కసారిగా పరిస్థితితులు తారుమారు కావడంతో దేశీయంగా కోవిడ్ ను ఎదుర్కొనే ప్రయత్నాలు మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తోంది దాదాపు 60 పేద దేశాలలో భారత్ సారధ్యంలో జరుగుతున్న వ్యాక్సిన్ కార్యక్రమానికి గండిపడే అవకాశం కనిపిస్తోంది. కోవాక్స్  కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు మందులను అందుబాటులోకి  తెచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, గావి వ్యాక్సిన్ కూటమి చేపట్టింది.

అయితే భారత్ నుంచి భారీ పరిమాణంలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే నమ్మకంతోనే కోవాక్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఔషధాల రంగంలో ఆసియా ఖండంలోనే బలమైన శక్తిగా ఉన్న భారత్ తమను ఈ ఆపద సమయంలో ఆదుకుంటుందని ఎన్నో దేశాలు ఆశించాయి. కానీ ఇప్పుడు భారత్ కే వాటిని దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెలలో ఇప్పటివరకు 1.2 మిలియన్ వ్యాక్సిన్ డోసులనే భారత్ ఎగుమతి చేసింది. ఈ ఏడాది జనవరి మార్చి మధ్య దాదాపు 64 మిలియన్ డోసులను ఎగుమతి చేసిన భారత్ సొంత అవసరాలపైనే దృష్టి పెట్టడం, దీనిపై ఆధారపడిన దేశాలలో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితి ఉన్నందువల్ల దేశీయ అవసరాలకే మందులు సరిపోవడం లేదని ఎగుమతులపై ఇతర దేశాలకు ఎలాంటి హామీలు ఇవ్వలేమని ఓ అధికారి వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ ను భారత్ దిగుమతి చేసుకోవలసి రావడం అనివార్యమైందని పేర్కొన్న ఓ అధికారి "మా అవసరాలే తీరనప్పుడు ఇతర దేశాలకు ఎలా ఎగుమతి చేస్తాం" అని వ్యాఖ్యానించారు. 

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

   10 hours ago


నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   15 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   a day ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   a day ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13-05-2021


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle