newssting
Radio
BITING NEWS :
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని సోలా ప్రాంతంలో పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ ప్రబలింది. అహ్మదాబాద్ నగరంలో సేకరించిన శాంపిళ్ల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో అహ్మదాబాద్ జిల్లాలో ముందుజాగ్రత్తగా మాంసం, చికెన్ విక్రయాలను జిల్లా కలెక్టరు నిషేధించారు * బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది * దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండురోజులు పూర్తిగా ఇదే అంశంపై చర్చించనున్నారు * భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి * తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్‌ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు * కర్ణాటకలో సంచలనం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని పుకార్లు వస్తున్నాయి. విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది * ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్‌ జనవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు * గుజరాత్‌లోని కెవాడియాలో శనివారం సైనిక కమాండర్ల సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మేధోమధన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైతం సమీక్ష జరుపనున్నారు * కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ యూనిట్‌ ఎంపిక చేసింది * సరూర్‌నగర్‌ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్‌ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి * జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది * గురు‌వారం అత్యధికంగా భద్రా‌చ‌లంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. ఆది‌లా‌బాద్‌, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నిజా‌మా‌బాద్‌, పెద్దపల్లి తది‌తర జిల్లాల్లో 37 డిగ్రీ‌ల‌కు‌పై‌గానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆది‌లా‌బా‌ద్‌లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది * రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌ కాంగ్రెస్‌మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్‌ అడ్వైజరీ టాస్క్‌ ఫోర్స్‌ ఈ అవార్డును ప్రకటించింది * సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపు మేరకు.. మల్లన్నసాగర్ ముట్టడికి బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నేతల అరెస్ట్‌తో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది * భద్రాచలంలో ఏప్రిల్‌ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు * ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.90.8 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. ఫిబ్రవరి నెలలో 14.41 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 13 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లభించింది. గురువారం 25,534 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 14న పురంధరదాసు 967వ అవతారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి * విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు * ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆరంజ్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మందికి గాయాలయ్యాయి * విశాఖ ప్లాంట్‌ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు.

అయిదు రాష్ట్రాల్లో పెరిగిన కోవిడ్ కేసులు.. నిబంధనలు పాటించాలన్న కేంద్రం

21-02-202121-02-2021 14:29:11 IST
2021-02-21T08:59:11.465Z21-02-2021 2021-02-21T05:40:08.961Z - - 09-03-2021

అయిదు రాష్ట్రాల్లో పెరిగిన కోవిడ్ కేసులు.. నిబంధనలు పాటించాలన్న కేంద్రం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కొత్తగా అయిదు రాష్ట్రాల్లో (కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్) రోజువారీగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని కేంద్రప్రభుత్వం తెలిపింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో కరోనా వైరస్ వ్యాప్తి దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముందుకు రావడంతో ఇక కరోనా వైరస్ ప్రభావం ముగిసినట్లేనని భావిస్తే ఫిబ్రవరిలో మళ్లీ అయిదు రాష్ట్రాల్లో కరోనా పుంజుకుంటున్న నేపథ్యంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది.

గతవారంరోజులుగా, మహారాష్ట్రలో రోజువారీ కేసులు అసాధారణంగా పెరుగుతున్నాయి. దీంతో దేశంలోనే అత్యంత అధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర మరోసారి రికార్డు సృష్టించింది. గత 24 గంటల్లో 6,112 కేసులు నమోదయ్యాయని కేంద్రప్రభుత్వం తెలిపింది. నిన్నమొన్నటివరకు యావత్మాల్‌, అమరావతిలోనే కరోనా విజృంభణ కనిపించగా.. అకోలా, పుణె, బుల్దానా, వార్దా, నాగపూర్‌లోనూ తాజాగా బాధితులు పెరుగుతున్నారు. దీంతో ఈ జిల్లాలతో పాటు నాసిక్‌కూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

మహారాష్ట్రకు మల్లే పంజాబ్ కూడా గత వారం రోజుల్లో ఉన్నట్లుండి కరోనా కేసులు పెరుగుతున్నాయని, గత 24 గంటల్లోనే 383 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్రప్రభుత్వం పేర్కొంది. అయితే లోకల్ రైళ్లను ప్రారంభించిన తర్వాత ప్రజలు భద్రతాచర్యలు పాటించకపోవడంతోనే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని మహారాష్ట్ర ప్రభుత్వాధికారులు చెప్పారు. దీంతో గురువారం ముంబైలో మరో రెండు జిల్లాల్లో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నామని ప్రభుత్వం యంత్రాంగం పేర్కొంది. గృహ ఏకాంతాన్ని పాటించడం, పెళ్లిళ్లు, బహిరంగంగా గుమికూడటంపై నిబంధనలు పాటించనివారిని ప్రాసిక్యూట్ చేస్తామని ముంబై కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు.

పైగా సబర్బన్ రైళ్లలో మాస్క్ లేకుండా ప్రయాణించేవారిపై చర్యలు తీసుకోవడానికి 300 మంది మార్షల్స్‌ని నియమించామని పురపాలక సంస్థ చెప్పింది. నిబంధనలను అతిక్రమించేవారిని రోజుకు 25 వేలమందిని పట్టుకుని జరిమానా విధిస్తామని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

అలాగే మధ్యప్రదేశ్‌లో కూడా ఫిబ్రవరి 13 నుంచి రోజువారీ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో 297 కేసులు నమోదయ్యాయని కేంద్రం పేర్కొంది.  అలాగే గత వారంరోజులుగా చత్తీస్‌గఢ్‌లోనూ కేసులు పెరుగుతూ శనివారం ఒక్కరోజే 259 కేసులు నమోదయ్యాయని కేంద్రం పేర్కొంది. కేరళలోనూ రోజూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోందని, శనివారం కేరళలో 4,854 కొత్త కేసులు బయటపడగా, మొత్తం కేసులు 9,61,789కు చేరుకున్నాయిని కేంద్రప్రభుత్వం తెలిపింది.

కరోనాను కట్టడి చేయడంలో కొన్ని రాష్ట్రాలు చూపిస్తున్న చొరవ కారణంగా 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కారణంగా గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదని కానీ అయిదు రాష్ట్రాల్లో మాత్రం మళ్లీ కరోనా సంక్రమణ కేసులు పెరుగుతుండటంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో గత 24 గంటల్లో 13,993 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. గత 22 రోజుల్లో ఇదే అత్యధిక కేసుల సంఖ్య కావడం ఆందోళన కలిగిస్తుంది. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,09,77,387కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. 

కరోనా కేసులు పెరుగుతుండటంతో బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) నిబంధనలు కఠినం చేస్తోంది. మాస్క్‌లు ధరించకుండా పట్టుబడిన 13 వేల మంది నుంచి శుక్రవారం రూ.27 లక్షలు వసూలు చేసింది. పది నెలల్లో 15 లక్షల మంది నుంచి రూ.31 కోట్లు రాబట్టింది. పాజిటివ్‌లు బయటకు వస్తుండటాన్ని బీఎంసీ తీవ్రంగా పరిగణిస్తోంది. వీరు ఉంటున్న ప్రాంతాల్లోని 1,305 భవనాలను సీల్‌ చేసింది. వీటిలో 70 వేల మందిపైగా నివసిస్తుండగా.. 2,749 పాజిటివ్‌లున్నారు. 

ప్రజలు అజాగ్రత్తగా ఉన్న కారణంగానే పెరుగుదల నమోదవుతోందనే అభిప్రాయాన్ని నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా వైరస్ సామూహికంగా వ్యాప్తి చెందకుండా నిరోధించాలంటే కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కేంద్రం హెచ్చరించింది.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని కోరిన మహిళా ఎంపీ

అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని కోరిన మహిళా ఎంపీ

   5 hours ago


73 ఏళ్ల పెద్దాయ‌న‌కు పెళ్లి మోజు.. కోటి 30 ల‌క్ష‌ల‌తో అమ్మాయి జంప్

73 ఏళ్ల పెద్దాయ‌న‌కు పెళ్లి మోజు.. కోటి 30 ల‌క్ష‌ల‌తో అమ్మాయి జంప్

   5 hours ago


కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,599 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,599 మందికి కరోనా

   13 hours ago


ప్రపంచానికి భారత్ ఇచ్చిన వరం వ్యాక్సిన్లు.. అమెరికా సైంటిస్టు ప్రశంసలు

ప్రపంచానికి భారత్ ఇచ్చిన వరం వ్యాక్సిన్లు.. అమెరికా సైంటిస్టు ప్రశంసలు

   14 hours ago


ఈ ఏడాదికి.. నారీ వారియ‌ర్ గా నామ‌క‌ర‌ణం చేద్దాం

ఈ ఏడాదికి.. నారీ వారియ‌ర్ గా నామ‌క‌ర‌ణం చేద్దాం

   16 hours ago


దీదీపై మోదీ సెటైర్లు..!

దీదీపై మోదీ సెటైర్లు..!

   07-03-2021


కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,711 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,711 మందికి కరోనా..!

   07-03-2021


కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు... ఐటీదాడులపై తాప్సీ

కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు... ఐటీదాడులపై తాప్సీ

   07-03-2021


ఆ సీడీలు బయటకు రాకుండా ఉండడానికి 5 కోట్ల డీల్ కూడా కుదిరిందట..!

ఆ సీడీలు బయటకు రాకుండా ఉండడానికి 5 కోట్ల డీల్ కూడా కుదిరిందట..!

   06-03-2021


సాగు చట్టాలను రద్దు చేయకుంటే 500 రోజులైనా ఆందోళనలు ఆపం.. రైతుసంఘాలు

సాగు చట్టాలను రద్దు చేయకుంటే 500 రోజులైనా ఆందోళనలు ఆపం.. రైతుసంఘాలు

   06-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle