newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

14-05-202114-05-2021 08:03:50 IST
Updated On 14-05-2021 08:16:08 ISTUpdated On 14-05-20212021-05-14T02:33:50.903Z14-05-2021 2021-05-14T02:33:43.654Z - 2021-05-14T02:46:08.912Z - 14-05-2021

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్ లో కరోనా టీకాల సమస్య వెంటాడుతూ ఉన్న సంగతి తెలిసిందే..! మొదటి డోస్ తీసుకున్న వాళ్ళకే రెండో డోస్ ఇవ్వాలని చాలా రాష్ట్రాల్లో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 18-44 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వాళ్లకు వ్యాక్సిన్లు ఇవ్వడానికి అధికారులు సంశయిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి తక్కువ వ్యాక్సిన్ డోసులు వస్తూ ఉండడమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోడానికి కారణమని అంటున్నారు. అయితే రాబోయే నెలల్లో పరిస్థితుల్లో చాలా మార్పులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

ఆగస్టు-డిసెంబరు నెలల మధ్య 200 కోట్ల కరోనా టీకా డోసులు భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నీతి ఆయోగ్‌ సభ్యుడు(ఆరోగ్యం) వి.కె.పాల్‌ తెలిపారు. ఇదే జరిగితే భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగే అవకాశం ఉంటుంది. 200 కోట్ల డోసుల్లో సీరం తయారు చేస్తున్న కొవి‌షీల్డ్‌ 75 కోట్లు, కొవాగ్జిన్‌ 55 కోట్లు వుంటాయని పాల్‌ చెప్పుకొచ్చారు.

బయోలాజికల్‌-ఈ 30 కోట్లు, నొవావాక్స్‌ 20 కోట్లు, స్పుత్నిక్‌-వి 15.6 కోట్లు, భారత్‌ బయోటెక్‌ ముక్కు ద్వారా ఇచ్చే టీకా 10 కోట్లు, జైడస్‌ క్యాడిలా 5 కోట్లు, జెన్నోవాకు చెందిన టీకా డోసులు 6 కోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్లకు మాత్రమే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే..! 

డబ్బు జనానిదే... ఫ్రీ వ్యాక్సిన్ కు ఎందుకు వెనకడుగు?

రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వి' వ్యాక్సిన్లను వచ్చే వారం నుంచి భారత్ లో అందుబాటులోకి తెస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డోసులు వచ్చే వారం నుంచి భారత మార్కెట్లలో లభ్యమవుతాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి స్పుత్నిక్ వి డోసులను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, జులై నుంచి భారత్ లోనే ఈ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తామని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్లను హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఉత్పత్తి చేయనుంది. ఈ నెలాఖరుకు 30 లక్షల స్పుత్నిక్ వి డోసులు భారత్ చేరుకోనున్నాయి. 

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   4 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   19 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

   12-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle