newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

18 ఏళ్ళు దాటితే కోవిడ్ టీకా వేయాలి.. సుప్రీంకోర్టులో పిటీషన్

17-04-202117-04-2021 11:51:20 IST
2021-04-17T06:21:20.130Z17-04-2021 2021-04-17T06:21:09.089Z - - 15-05-2021

18 ఏళ్ళు దాటితే కోవిడ్ టీకా వేయాలి.. సుప్రీంకోర్టులో పిటీషన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ను అందరికీ అందుబాటులోకి తేవాలనే డిమాండ్ల నేపథ్యంలో 40 సంవత్సరాల లోపు వారికి కూడా ఈ వ్యాక్సిన్ అందించాలని సుప్రీం కోర్టులో ప్రజాహిత పిటిషన్ దాఖలైంది. ఈ కేసుల తీవ్రత తగ్గాలంటే 18 సంవత్సరాల వయసు దాటిన వారికి కూడా టీకాలు వేయాలని అడ్వొకేట్ రష్మీ సింగ్ దాఖలు చేసిన పిటీషన్ సుప్రీం కోర్టు విచారించబోతోంది. 18 సంవత్సరాల వయసు పైబడిన వారికి అలాగే 45 సంవత్సరాల లోపు వారికి ఈ వ్యాక్సిన్ వేయకపోవడం అన్నది రాజ్యాంగంలోని 21, 18వ అధికరణను ఉల్లంఘించడమే అవుతుందని పిటీషనర్ రష్మీ సింగ్ తెలిపారు.   

ఈ నేపథ్యంలో 45 సంవత్సరాల పైబడిన వారికే వ్యాక్సిన్ ఇవ్వాలన్న నిబంధనను సడలించాలని ఆమె కోరారు. న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్. సుభాష్ రెడ్డిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ విచారిస్తుంది. పెద్ద సంఖ్యలో యువతకు, ఉద్యోగిత జనాభాకు వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కేసుల తీవ్రత గణనీయంగా తగ్గుతుందని, అలాగే దీని వ్యాప్తిని కూడా గట్టిగానే నిరోధించగలుగుతామని పిటీషనర్ పేర్కొన్నారు. ఇతర వ్యాధులు ఉన్న 45 సంవత్సరాల లోపు వారికి ఈ వ్యాక్సిన్ ను ఇవ్వకపోవడం అన్నది రాజ్యాంగంలోని 21వ అధికరణ హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.

ప్రభుత్వం తన చర్య ద్వారా రాజ్యాంగంలోని 14వ అధికరణం కల్పిస్తున్న సమానత్వ హక్కును కూడా ఉల్లంఘిస్తున్నదని కూడా పిటీషనర్ తెలిపారు. ప్రభుత్వం జనవరి 16 నుంచి టీకాల కార్యక్రమం మొదలెట్టింది. మొదట దీనిని ఆరోగ్య కార్యకర్తలకు, ముందుండి సేవలు అందిస్తున్న కరోనా యోధులకు పరిమితం చేసింది. అయితే మార్చి 1 నుంచి 60 సంవత్సరాలు పైబడిన వారికి అలాగే ఇటారా వ్యాధులు ఉన్న 45 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న వారికి దీనిని విస్తరించింది. దైనందిన కూలీలు సహా పెద్ద సంఖ్యలో అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలకు ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం లేదని ఆమె అన్నారు.   

మరోపక్క నిన్న మొన్నటి వరకూ ఈ వ్యాక్సిన్ ఎగుమతి చేసిన భారత్ తాజా పరిస్థితుల దృష్ట్యా దీనిని దిగుమతి చేసుకోవాల్సి రావడం కూడా తాజా నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు.    తాజా పిటీషన్ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏ రకమైన తీర్పును వెలువరించబోతోందన్న దానిపై ఆసక్తి నెలకొంది. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య అత్యంత తీవ్రంగా పెరగడం, అదే క్రమంలో వ్యాక్సిన్ లభ్యత కూడా అనుకున్న స్థాయిలో లేకపోవడం ఆందోళనకు కారణం అవుతోంది. ఇప్పటికే పరిస్థితి తీవ్రతను సంతరించుకున్న దృష్ట్యా భారత్ తమ టీకాల కార్యక్రమాన్ని విశ్వజనీన రీతిలో అన్ని వర్గాలకు విస్తరించి టీకాలను అందుబాటులోకి తేవాలన్న నిపుణుల అభిప్రాయాన్ని కూడా పిటీషనర్ ఉటంకించారు.  

10 రాష్ట్రాలలో కోవిడ్ కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

   9 hours ago


నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   15 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   a day ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   a day ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13-05-2021


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle