భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..
16-01-202116-01-2021 11:34:13 IST
Updated On 16-01-2021 12:34:57 ISTUpdated On 16-01-20212021-01-16T06:04:13.652Z16-01-2021 2021-01-16T06:04:10.662Z - 2021-01-16T07:04:57.456Z - 16-01-2021

భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రక్రియను నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. వ్యాక్సిన్ తీసుకోనున్న వారికి ఇప్పటికే వ్యక్తిగతంగా ఫోన్ల ద్వారా మెసేజ్ లు పంపారు. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమంపై మోదీ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూసిందని చెప్పారు. వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులే వ్యాక్సిన్ తొలి హక్కుదారులని మోదీ అన్నారు. వ్యాక్సిన్ల తయారీ కోసం చాలా మంది విశ్రాంతి లేకుండా శ్రమించారని.. వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడ్డారని అన్నారు. అతి తక్కువ సమయంలో వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారని మోదీ తెలిపారు. శాస్త్రవేత్తల కృషికి ఫలితంగా దేశంలో రెండు వ్యాక్సిన్లు వచ్చాయని.. మరికొన్ని వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తాయని అన్నారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరని తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు చూపిన ధైర్యాన్ని ఇప్పుడు కూడా చూపాలని తెలిపారు. తొలి విడతలో మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని వివరించారు. రెండో విడతలో 30 కోట్ల మందికి వేస్తామని అన్నారు. దేశీయ వ్యాక్సిన్ తయారీలో భారత సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసిందని మోదీ తెలిపారు. మన దేశ సైన్స్ సమర్థతపై ప్రపంచమంతా విశ్వాసంతో ఉందని తెలిపారు. విదేశీ వ్యాక్సిన్ల కంటే మన దేశంలోని వ్యాక్సిన్లు చౌక ధరలకు లభిస్తున్నాయని మోదీ అన్నారు. వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం ఆమోదించిన ఏదైనా గుర్తింపు కార్డును వ్యాక్సిన్ కేంద్రంలో చూపించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అరగంట పాటు వారిని ఆసుపత్రిలోనే ఉంచి ఆరోగ్య పరిస్థితులను గమనిస్తారు. వ్యాక్సినేషన్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కేంద్రప్రభుత్వం గురువారం సాయంత్రం నిబంధనావళిని జారీ చేసింది. 18 సంవత్సరాల వయసు దాటిన వారికి మాత్రమే టీకా వేయాలని, గర్భిణీ స్త్రీలకు కూడా టీకా వేయవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా 3,006 స్థలాల్లో 3 లక్షలమంది ఆరోగ్య సిబ్బందికి కోవిడ్-19 వైరస్ నిరోధక టీకాలను వేయనున్నారు. ఈ సందర్భంగానే కేంద్రం ఎవరికి వ్యాక్సిన్ వేయకూడదు, ఎవరికి వేయవచ్చు అంటూ రాష్టాల ప్రభుత్వాలకు నిర్దిష్టంగా ఆదేశాలు పంపింది. ఆ ప్రకారమే 18 ఏళ్ల లోపు వారికి, గర్భిణులకు టీకాలు వేయవద్దని కేంద్రం ఆదేశించింది. అలాగే కేంద్రం అనుమతించిన రెండు వ్యాక్సిన్లను మార్చి మార్చి వేయడాన్ని అనుమతించవద్దని కేంద్రప్రభుత్వం సూచించింది. తొలి డోసును ఏ వ్యాక్సిన్ అయితే వేస్తారో రెండో డోసుకు కూడా అదే వ్యాక్సిన్ వేయాలి తప్ప మరో వ్యాక్సిన్ని వేయకూడదని, తమకు రెండో వ్యాక్సిన్ కావాలని ప్రజలు డిమాండ్ చేయవద్దని కేంద్రం హెచ్చరించింది. పద్దెనిమిదేళ్లలోపు వారికి టీకా వేయొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

వ్యాక్సిన్ పాలసీకి భారత్ కట్టుబడింది.. IMF చీప్ గీతా గోపీనాథ్ ప్రశంస
28 minutes ago

ఇంతకూ ఆ 5 కోట్లు నాకెవరిచ్చారబ్బా... తాప్సీ బిగ్ జోక్
2 hours ago

అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని కోరిన మహిళా ఎంపీ
17 hours ago

73 ఏళ్ల పెద్దాయనకు పెళ్లి మోజు.. కోటి 30 లక్షలతో అమ్మాయి జంప్
17 hours ago

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,599 మందికి కరోనా
08-03-2021

ప్రపంచానికి భారత్ ఇచ్చిన వరం వ్యాక్సిన్లు.. అమెరికా సైంటిస్టు ప్రశంసలు
08-03-2021

ఈ ఏడాదికి.. నారీ వారియర్ గా నామకరణం చేద్దాం
08-03-2021

దీదీపై మోదీ సెటైర్లు..!
07-03-2021

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,711 మందికి కరోనా..!
07-03-2021

కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు... ఐటీదాడులపై తాప్సీ
07-03-2021
ఇంకా