newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇంత జాప్యం ఎందుకు.. రాష్ట్రాలను నిలదీసిన కేంద్రం

01-04-202101-04-2021 18:28:43 IST
2021-04-01T12:58:43.626Z01-04-2021 2021-04-01T11:53:38.702Z - - 16-04-2021

వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇంత జాప్యం ఎందుకు.. రాష్ట్రాలను నిలదీసిన కేంద్రం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తుండటంతో వైరస్ నియంత్రణ చర్యలపై కేంద్రప్రభుత్వం చూపు సారించింది. ఒకవైపు 45 సంవత్సరాల వయస్సు దాటిన వారికి కూడా నేటినుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయిస్తూనే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొన్ని ప్రాంతాల్లో ఎందుకు నిదానంగా సాగుతోందంటూ కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసింది. 

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి 16న ప్రారంభమైంది. ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఉద్దేశించిన తొలి ప్రక్రియ ఇది. తదుపరి దశ మార్చి 1న ప్రారంభమైంది. 60 ఏళ్ల పైబడిన ప్రజలకు, 45 ఏళ్లకు పైబడిన దీర్ఘవ్యాధులు కల వారు  కోవిడ్-18 వ్యాక్సిన్ టీకాలను వేయవచ్చని కేంద్రం అనుమతించింది.

అయితే కరోనా తీవ్రత ఉధృతమవుతున్న నేపథ్యంలో దేశంలో 45 ఏళ్లు పైబడిన వారందరికీ నేటి నుంచి టీకాలు వేయవచ్చని కేంద్రం మూడో దశ టీకా ప్రక్రియను ప్రారంభించింది.

దేశంలో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా వేయవచ్చంటూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలు నేటినుంచి అమల్లోకి వచ్చాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతూ వ్యాక్సినేషనల్‌ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్న ప్రాంతాలను వెంటనే గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. 

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్, నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈవో డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.శర్మ బుధవారం దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ కార్యదర్శులు, ఎన్‌హెచ్‌ఎం మిషన్‌ డైరెక్టర్లు, ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 

దేశంలో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సినేషన్‌ చేయడంపై చర్చించారు. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కేటగిరీలో అర్హులైన వారికే టీకా అందేలా చూడాలని పేర్కొన్నారు. కో–విన్‌ పోర్టల్‌లో తప్పుడు, డూప్లికేట్‌ ఎంట్రీలను నివారించాలన్నారు. ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్ల సేవలను సమర్థంగా ఉపయోగించుకోవాలని కోరారు.

కానీ, పెద్ద సంఖ్యలో కరోనా వ్యాక్సిన్‌ డోసులు వృథా అవుతుండడం పట్ల రాజేష్‌ భూషణ్, డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.శర్మ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో 6 శాతం డోసులు వృథా అవుతున్నట్లు అంచనా. దీన్ని ఒకటి కంటే తక్కువ శాతానికి తీసుకురావాలని రాష్ట్రాలు, యూటీలను వారు ఆదేశించారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ స్టాక్‌ను సమయానుగుణంగా ఉపయోగిస్తే వేస్టేజీ తగ్గుతుందన్నారు. తద్వారా కాలం చెల్లే వ్యాక్సిన్ల సంఖ్యను కనిష్ట స్థాయికి తగ్గించవచ్చని తెలిపారు.

దేశంలో అయిదు రాష్ట్రాల్లోనే 80 శాతం కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంట్లో 61 శాతం కేసులు కేవలం మహారాష్ట్రలో నమోదు కావడం విశేషం. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లో వైరస్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కరోనా కేసులు 5,52,566. దేశంలో కొత్తగా 53,480 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,21,49,335కు చేరుకుంది. గత 24 గంటల్లో 354 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దేశంలో మొత్తం కరోనా సంబంధిత మరణాల సంఖ్య 1,62,468కి చేరింది. బుధవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా అర్హులకు 10,46,757 సెషన్లలో 6,30,54,353 కరోనా వ్యాక్సిన్‌ డోసులను ఇచ్చినట్లు పేర్కొంది.

చైనా కుయుక్తులను తిప్పికొట్టాం వత్తిళ్లకు తలవంచే ప్రసక్తే లేదు: బిపిన్ రావత్

చైనా కుయుక్తులను తిప్పికొట్టాం వత్తిళ్లకు తలవంచే ప్రసక్తే లేదు: బిపిన్ రావత్

   4 minutes ago


10 రాష్ట్రాలలో కోవిడ్  కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

10 రాష్ట్రాలలో కోవిడ్ కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

   11 hours ago


కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

   15 hours ago


రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

   17 hours ago


సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

   a day ago


మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

   15-04-2021


ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

   20 hours ago


దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

   14-04-2021


ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

   14-04-2021


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

   14-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle