newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

ప్రతి పౌరుడికీ వ్యాక్సిన్ అందిస్తాం... అలసత్వం వద్దన్న ప్రధాని

18-10-202018-10-2020 09:39:08 IST
2020-10-18T04:09:08.104Z18-10-2020 2020-10-18T04:09:05.177Z - - 21-10-2020

ప్రతి పౌరుడికీ వ్యాక్సిన్ అందిస్తాం... అలసత్వం వద్దన్న ప్రధాని
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో ఎన్నికలు నిర్వహించే తరహాలోనే వ్యాక్సిన్ పంపిణీకి సిద్దం కావాలంటూ ప్రధాని అధికారులకు  పిలుపునిచ్చారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు, విపత్తు నిర్వహణ మాదిరిగానే కరోనా వ్యాక్సీన్ డెలివరీ వ్యవస్థ ఉండాలన్నారు. ఈ ప్రక్రియలో అన్ని స్థాయిల ప్రభుత్వ శాఖలు, సామాజిక సంస్థలు పాల్గొనేలా చూడాల్సి ఉందన్నారు. వ్యాక్సిన్ పంపిణీ చేసే సమయంలో అలసత్వం ప్రదర్సించవద్దని అధికారులకు ప్రధాని దిశా నిర్దేశం చేశారు.

దేశంలోని కోవిడ్-19 మహమ్మారి పరిస్థితిని, టీకా పంపిణీ, ఆయా వ్యవస్థల సంసిద్ధతను ప్రధాని శనివారం సమీక్షించారు. దేశ భౌగోళిక పరిధిని, వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వ్యాక్సిన్‌ను వేగంగా ప్రజలకు అందేలా చూడాలని ప్రధాని కోరారు. ప్రతి వ్యక్తికీ వ్యాక్సీన్ అందుబాటులో ఉండాలని సూచించారు. లాజిస్టిక్స్, డెలివరీ, పద్ధతులు అడుగడుగునా కఠినంగా ఉండాలని, కోల్డ్ స్టోరేజ్ చెయిన్ అధునాతన ప్రణాళిక, పంపిణీ నెట్‌వర్క్, వ్యాక్సినేషన్ క్లినిక్ పర్యవేక్షణ తదితర ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని ప్రధాని కోరారు. 

అవసరమైతే దీనికోసం దేశంలో ఎన్నికలు, విపత్తు నిర్వహణను విజయవంతంగా నిర్వహించిన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇందులో రాష్ట్రాల భాగస్వామ్యంతోపాటు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లా స్థాయి కార్య నిర్వాహకులు, పౌరసమాజ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అవసరమైన అన్ని డొమైన్ల నిపుణులు కీలక భూమిక పోషించాలన్నారు. 

దేశంలో రోజువారీ కేసులు, కేసుల్లో పెరుగుదల రేటు తగ్గుతోందన్న ప్రధాని.. ఈ సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం తగదన్నారు. మహమ్మారిని కట్టడి చేసే ప్రయత్నాలను కొనసాగించాలన్నారు. ఈ రానున్న పండగ సీజన్‌లో మాస్కు ధరించడం, చేతులు కడుక్కోవడం, పరిశుభ్రత పాటించడం వంటివి తప్పనిసరిగా కొనసాగించాలని కోరారు. దేశంలో అభివృద్ధి చేస్తున్న మూడు టీకాల్లో రెండో దశ ట్రయల్స్‌లో రెండు, మూడో దశలో ఒక టీకా ఉన్నాయని చెప్పారు.

పొరుగున ఉన్న అఫ్గానిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మారిషస్, నేపాల్, శ్రీలంక దేశాల శాస్త్రవేత్తలతో మన శాస్త్రవేత్తలు సమన్వయం చేసుకుంటూ పరిశోధన సామర్థ్యాన్ని మెరుగు పరుచుకుంటున్నారు. బంగ్లాదేశ్, మయన్మార్, ఖతార్, భూటాన్‌ తమ దేశాల్లో కూడా క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టాలని కోరుతున్నాయి. ఇరుగుపొరుగు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలకు కూడా కోవిడ్‌ టీకా, ఔషధాల విషయంలో సాయపడాలి అని ప్రధాని అన్నారు.  

కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం నాటి గణాంకాల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య 74 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 1,12,998కు చేరుకుంది. అయితే వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 65 లక్షలు దాటి రికవరీ రేటు 87.78 శాతానికి చేరిందని మంత్రిత్వ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.

దేశంలో కరోనా వైరస్‌ మ్యుటేషన్‌ లేదు.. అధికారుల వెల్లడి

దేశంలో కరోనా వైరస్‌ జన్యుపరంగా స్థిరంగా ఉందనీ, ఎటువంటి మ్యుటేషన్‌కు గురికాలేదని తమ అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ అధికారులు ప్రధానికి తెలిపారు. వైరస్‌లో మ్యుటేషన్‌ సంభవిస్తే టీకా అభివృద్ధిపై అది ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలి కాలంలో కరోనా వైరస్‌లో చోటుచేసుకున్న మ్యుటేషన్లు వివిధ దేశాల్లో కొనసాగుతున్న టీకాల రూపకల్పనపై ఎటువంటి ప్రభావం చూపబోదని అంతర్జాతీయ సంస్థల అధ్యయనాల్లోనూ రుజువయింది. వైరస్‌లో సంభవించే కొన్ని మార్పులతో వైరస్‌ వ్యాప్తి వేగవంతం అవుతుందనే అంచనాలున్నాయి. దాదాపు 72 దేశాల్లో సంభవించిన కరోనా వైరస్‌ జెనోమ్‌ మ్యుటేషన్లతో భారత్‌లోని 5.39 శాతం మ్యుటేషన్లకు పోలికలున్నట్లు కూడా గత నెలలో ఓ శాస్త్రవేత్తల బృందం తెలిపిందని వారు చెప్పారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle