newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 96,982 మందికి కరోనా..!

06-04-202106-04-2021 11:44:00 IST
Updated On 06-04-2021 11:54:15 ISTUpdated On 06-04-20212021-04-06T06:14:00.562Z06-04-2021 2021-04-06T06:13:57.577Z - 2021-04-06T06:24:15.096Z - 06-04-2021

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 96,982 మందికి కరోనా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశంలో గత 24 గంటల్లో 96,982 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో మరో 446 మంది కరోనాకు బలయ్యారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటీ 26 లక్షల 86 వేల 49కి పెరగ్గా.. లక్షా 65 వేల 547 మంది మహమ్మారి కారణంగా మరణించారు. దేశంలో ఇంకా 7 లక్షల 88 వేల 223 మంది కరోనాతో చికిత్స తీసుకుంటున్నారు. కోటీ 17 లక్షల 32 వేల 279 మంది కోలుకున్నారు. భారతదేశంలో ఇప్పటి దాకా 8 కోట్ల 31 లక్షల 10 వేల 926 మంది కరోనా టీకా వేయించుకున్నారు. మంగళవారం ఒక్కరోజే 43 లక్షల 966 మందికి వ్యాక్సిన్ వేశారు. కరోనా టెస్టుల్లో కేంద్రం ఓ మైలు రాయిని అధిగమించింది. ఇప్పటిదాకా 25 కోట్ల టెస్టులు చేసింది. మంగళవారం 12 లక్షల 11 వేల 612 టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు మొత్తం టెస్టుల సంఖ్య 25 కోట్ల 2 లక్షల 31 వేల 269కు పెరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,498 కేసులు నమోదు కాగా, ఆరుగురు మరణించారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణ  రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,14,735కు పెరగ్గా, మొత్తం మరణాల సంఖ్య 1,729కి చేరుకుంది. 3,03,013 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9,993 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరిలో 5,323 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో  313 కేసులు వెలుగుచూశాయి.

కరోనా ఉగ్ర రూపం.. ఒక్కరోజులోనే లక్ష కేసుల సరికొత్త రికార్డు..!

05-04-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం  గడచిన 24 గంటల్లో 30,678 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,326 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 10,710కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 282 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 271, విశాఖ జిల్లాలో 222, నెల్లూరు జిల్లాలో 171, కృష్ణా జిల్లాలో 138 కేసులు నమోదయ్యాయి. అత్పల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 2 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 911 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,244కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,09,002 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,91,048 మంది కోలుకున్నారు.

10 రాష్ట్రాలలో కోవిడ్  కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

10 రాష్ట్రాలలో కోవిడ్ కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

   11 hours ago


కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ

   14 hours ago


రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్

   17 hours ago


సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

   a day ago


మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్

   15-04-2021


ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా

   20 hours ago


దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

   14-04-2021


ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

ఒక్క‌రోజే వెయ్యిమంది చ‌నిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం

   14-04-2021


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా

   14-04-2021


ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!

ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!

   14-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle