కరోనా ఉగ్ర రూపం.. ఒక్కరోజులోనే లక్ష కేసుల సరికొత్త రికార్డు..!
05-04-202105-04-2021 10:25:53 IST
Updated On 05-04-2021 10:51:06 ISTUpdated On 05-04-20212021-04-05T04:55:53.131Z05-04-2021 2021-04-05T04:55:43.185Z - 2021-04-05T05:21:06.748Z - 05-04-2021

భారత్లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. భారతదేశంలో రోజువారీ కేసుల సంఖ్య లక్ష మార్కును దాటేసింది. గత 24 గంటల్లో కొత్తగా 1,03,558 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇంత భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారని చెబుతున్నారు. ఆదివారం వైరస్ బారినపడి 478 మంది ప్రాణాలు విడిచారు. దేశంలో తొలిసారి కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. గత ఏడాది సెప్టెంబరు 17న దేశంలో గరిష్ఠంగా 97,894 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ రికార్డు దాటి గత 24 గంటల్లో 1,03,558 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 52,847 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,25,89,067కు చేరింది. భారతదేశంలో మృతుల సంఖ్య 1,65,101కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,16,82,136మంది కోలుకున్నారు. 7,41,830 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 7,91,05,163 మందికి వ్యాక్సిన్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,097 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. ఒక్కరోజులో కరోనాతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 268 మంది కోలుకున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,237కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,02,768 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,723గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 8,746 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 4,458 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 302 మందికి కరోనా సోకింది. కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 93,249 మందికి కరోనా..! 04-04-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 31,072 కరోనా పరీక్షలు నిర్వహంచగా 1,730 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 378 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 338, విశాఖ జిల్లాలో 235, కృష్ణా జిల్లాలో 226, నెల్లూరు జిల్లాలో 164 కేసులు గుర్తించారు. అత్యల్పంగా పశ్చిమ గోదావరిలో 10 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 842 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,07,676 మందికి కరోనా సోకగా, వారిలో 8,90,137 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,300 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మరణాల సంఖ్య 7,239కి చేరింది.

10 రాష్ట్రాలలో కోవిడ్ కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు
11 hours ago

కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ
15 hours ago

రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్
17 hours ago

సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా
a day ago

మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్
15-04-2021

ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా
20 hours ago

దేశవ్యాప్త లాక్డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య
14-04-2021

ఒక్కరోజే వెయ్యిమంది చనిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం
14-04-2021

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా
14-04-2021

ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!
14-04-2021
ఇంకా