newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

కరోనా కేసుల అప్డేట్

28-10-202028-10-2020 11:03:29 IST
Updated On 28-10-2020 12:20:43 ISTUpdated On 28-10-20202020-10-28T05:33:29.485Z28-10-2020 2020-10-28T05:33:06.554Z - 2020-10-28T06:50:43.043Z - 28-10-2020

కరోనా కేసుల అప్డేట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

దేశంలో కరోనా కేసుల సంఖ్య 80 లక్షలకు చేరువవుతోంది. కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 43,893 మందికి కరోనా నిర్ధారణ అయిందని  తెలిపింది. అదే సమయంలో 58,439 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,90,322 కి చేరింది. 24 గంట‌ల సమయంలో 508 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,20,010 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 72,59,509 మంది కోలుకున్నారు. 6,10,803 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  

తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,481 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,451 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,34,152 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,14,917 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,319 కి చేరింది. ప్రస్తుతం 17,916 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 14,883 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 279 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 111 కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో  గడచిన 24 గంటల్లో 74,757 కరోనా టెస్టులు చేయగా, 2,901 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 555 కేసులు రాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 55 కేసులు వచ్చాయి. అదే సమయంలో రాష్ట్రంలో 19 మంది కరోనాతో మృతి చెందారు. 4,352 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,11,825కి చేరింది. ఇప్పటివరకు 7,77,900 మంది వైరస్ ప్రభావం నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 27,300 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. అటు, మొత్తం మరణాల సంఖ్య 6,625కి పెరిగింది.

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle