newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

కరోనా కేసుల అప్డేట్.. తగ్గుతున్నాయి

25-10-202025-10-2020 13:19:00 IST
2020-10-25T07:49:00.648Z25-10-2020 2020-10-25T07:48:55.725Z - - 03-12-2020

కరోనా కేసుల అప్డేట్.. తగ్గుతున్నాయి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

 భారత్‌లో గడిచిన 24 గంటల్లో 50,129 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,64,811కి చేరింది. నిన్న ఒక్క రోజే 578 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,18,534 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 62,077 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 70,78,123 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78,64,811గా ఉండగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,68,154గా ఉంది.  కరోనా బారినపడి వారిలో దాదాపు 90 శాతం కోలుకుంటున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.51 శాతం తగ్గినట్టు వివరించింది.

తెలంగాణలో 978 కేసులు మాత్రమే నమోదైనట్టు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా  ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,31,252కు పెరిగింది. అలాగే, నిన్న కరోనా కారణంగా నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,307కు పెరిగింది. తెలంగాణలో 1,446 మంది కోలుకోవడంతో ఈ మొత్తం సంఖ్య 2,10,480కి చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 19,465 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, వీరిలో 16,430 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిన్న రాత్రి 8 గంటల నాటికి 185 కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 74,919 నమూనాలు పరీక్షించగా 3,342 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 551 కొత్త కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 60 పాజిటివ్ కేసులు వచ్చాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 22 మంది కరోనాతో మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 6,566కి పెరిగింది. తాజాగా 3,572 మందికి కరోనా నయం అయింది.ఓవరాల్ గణాంకాలు చూస్తే, ఏపీలో మొత్తం 8,04,026 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 7,65,991 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 31,469 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 75,02,933 నమూనాలు పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle