newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా కేసుల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న భారత్..!

07-04-202107-04-2021 11:10:48 IST
Updated On 07-04-2021 12:56:54 ISTUpdated On 07-04-20212021-04-07T05:40:48.662Z07-04-2021 2021-04-07T05:40:42.656Z - 2021-04-07T07:26:54.935Z - 07-04-2021

కరోనా కేసుల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న భారత్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భార‌తదేశంలో క‌రోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గడిచిన 24గంటల్లో 12,08,329 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 1,15,736 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. భారతదేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.28కోట్ల‌కు చేరింది. ఒక్క రోజే 630 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో కరోనా బారిన పడి మృత్యువాత ప‌డిన వారి సంఖ్య 1,66,177కి చేరింది. గత 24 గంటల్లో 59,856 మంది కరోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా భారతదేశంలో మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,17,92,135కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 8,43,473 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారతదేశంలో టీకా కార్య‌క్ర‌మం‌ ముమ్మరంగా కొన‌సాగు తోంది. ఇప్పటి వరకు 8,70,77,474 డోసులు వేసినట్లు భారత ప్రభుత్వం చెబుతోంది. 

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్త‌గా 1,914 కరోనా కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. అదే సమయంలో కరోనాతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 285 మంది కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,649 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,03,298 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,734గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 11,617 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 6,634 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 393 మందికి క‌రోనా సోకింది.

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 96,982 మందికి కరోనా..!

06-04-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో  గడచిన 24 గంటల్లో 31,657 కరోనా టెస్టులు నిర్వహించగా 1,941 మందికి కరోనా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలోనే 424 కొత్త కేసులు వెల్లడయ్యాయి. గుంటూరు తర్వాత అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 323, విశాఖ జిల్లాలో 258, నెల్లూరు జిల్లాలో 231, కృష్ణా జిల్లాలో 212 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 25 పాజిటివ్ కేసులు గుర్తించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 835 మంది కరోనా నుంచి కోలుకోగా, ఏడుగురు మరణించారు. కరోనా మృతుల సంఖ్య 7,251కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 9,10,943 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,91,883 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 11,809 మంది చికిత్స పొందుతున్నారు. 

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

   9 hours ago


ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

   13 hours ago


టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

   19 hours ago


ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

   20 hours ago


ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

   09-04-2021


వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

   09-04-2021


అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

   09-04-2021


డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

   08-04-2021


పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

   08-04-2021


అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

   08-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle