కరోనా కేసుల అప్డేట్స్..దేశంలో 96 లక్షలు దాటిన కరోనా కేసులు
05-12-202005-12-2020 12:47:12 IST
Updated On 05-12-2020 12:55:49 ISTUpdated On 05-12-20202020-12-05T07:17:12.945Z05-12-2020 2020-12-05T07:17:05.667Z - 2020-12-05T07:25:49.119Z - 05-12-2020

భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 96 లక్షలు దాటిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపింది. గత 24 గంటల్లో 36,652 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,08,211కి చేరింది. 24 గంటల్లో 42,533 మంది కోలుకున్నారు. గడచిన 24 గంటల సమయంలో 512 మంది కరోనా కారణంగా మృతి చెందారు. భారతదేశంలో మృతుల సంఖ్య 1,39,700కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 90,58,822 మంది కోలుకున్నారు. 4,09,689 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. తెలంగాణలో గత 24 గంటల్లో 596 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 802 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,72,719కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,62,751 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,470కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 8,498 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 6,465 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 102, రంగారెడ్డి జిల్లాలో 46 కరోనా కేసులు నమోదయ్యాయి. 04-12-2020న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 63,406 కరోనా పరీక్షలు నిర్వహించగా 599 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 115 కొత్త కేసులు వచ్చాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 8 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గత 24 గంటల్లో 913 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7,020కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 8,70,675 కాగా 8,57,233 మంది వైరస్ ప్రభావం నుంచి విముక్తులయ్యారు. ఇంకా 6,422 మంది చికిత్స పొందుతున్నారు.

నమ్మించి వంచించారు.. ఎవ్వరినీ వదలం.. ఢిల్లీ పోలీసు చీఫ్
an hour ago

పెట్రోల్ రేట్.. కనీవినీ ఎరుగని అద్భుతం
2 hours ago

నేపాల్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మోదీకి ప్రధాని ఓలి కృతజ్ఞతలు
3 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా
4 hours ago

ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో 'TCS'కు మూడోస్థానం
4 hours ago

ఫిబ్రవరి 1న పార్లమెంటుకు రైతుల ర్యాలీ నిలిపివేత
6 hours ago

అమెరికా 71వ విదేశాంగ మంత్రిగా అంటోనీ బ్లింకెన్ నియామకం
7 hours ago

ఇంకేంటి.. సినిమా థియేటర్లు ఫుల్ కెపాసిటీతో..!
18 hours ago

డబుల్ డిజిట్ వృద్ధి భారత్‌కే సాధ్యం.. ఐఎమ్ఎఫ్ అంచనా
a day ago

భారత్‌లో టీకా అమ్మకాలకు ఫైజర్ తీవ్ర యత్నాలు
27-01-2021
ఇంకా