newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 17,407 మందికి కరోనా..!

04-03-202104-03-2021 12:30:11 IST
2021-03-04T07:00:11.900Z04-03-2021 2021-03-04T07:00:07.223Z - - 11-04-2021

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 17,407 మందికి కరోనా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భారతదేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దేశంలో గత 24 గంటల్లో 17,407 మందికి కరోనా నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. అదే స‌మ‌యంలో 14,031 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,56,923కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 89 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,435కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,26,075 మంది కోలుకున్నారు. 1,73,413 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,66,16,048 మందికి వ్యాక్సిన్ వేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 152 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 114 మంది కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,406కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,95,821 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,637గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,948 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 835 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 25 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.    

మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనే కేసులు అధికంగా ఉన్నాయని, మొత్తం నమోదైన దాదాపు 15 వేల కేసుల్లో 85 శాతానికి పైగా ఈ ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రాష్ట్రాల్లో తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు ముగ్గురేసి సభ్యులతో కూడిన కేంద్ర బృందాలను పంపించామని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. కరోనా కారణంగా మంగళవారం నాడు 98 మంది మరణించారని, వీరిలోనూ 70 శాతం మందికి పైగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారేనని అన్నారు. కరోనా టీకా పంపిణీ వేళలపై ఉన్న ఆంక్షలను తొలగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇకపై రోజులో ఏ సమయంలోనైనా టీకాను పొందవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో 24 గంటల పాటు వ్యాక్సినేషన్ కొనసాగుతుందని, ప్రజలు వారికి నచ్చిన సమయంలో వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవచ్చని స్పష్టం చేశారు. 

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

   10 hours ago

ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

   14 hours ago

టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

   20 hours ago

ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

   21 hours ago

ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

   09-04-2021

వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

   09-04-2021

అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

   09-04-2021

డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

   08-04-2021

పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

   08-04-2021

అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

   08-04-2021

ఇంకా

Naresh

 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle