newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 46,232 మందికి కరోనా

21-11-202021-11-2020 10:15:43 IST
2020-11-21T04:45:43.289Z21-11-2020 2020-11-21T04:45:35.366Z - - 07-12-2021

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 46,232 మందికి కరోనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

 భారత దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 46,232 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,50,598 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 49,715 మంది కోలుకున్నారు. గడచిన 24 గంట‌ల సమయంలో 564  మంది కరోనా కారణంగా మృతి చెందారు. కరోనా మృతుల సంఖ్య భారతదేశంలో 1,32,726 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 84,78,124 మంది కోలుకున్నారు. 4,39,747 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

తెలంగాణలో గత 24 గంటల్లో 925 కరోనా కేసులు నమోదయ్యాయని.. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,367 మంది కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,62,653 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,49,157 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,426 కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 12,070 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 9,741 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 161 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 75 కేసులు నిర్ధారణ అయ్యాయి

నవంబర్ 20న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన బులెటిన్ ప్రకారం..  ఏపీలో గత 24 గంటల్లో 66,002 కరోనా టెస్టులు నిర్వహించగా 1,221 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 202 కేసులు రాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 19 కేసులు గుర్తించారు.  రాష్ట్రవ్యాప్తంగా 10 మంది మరణించగా 1,829 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 8,59,932 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,37,630 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,382 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ముంబైలోని జల్లెడ పడుతున్న అధికారులు.. 100 మంది ప్రయాణికుల జాడ తెలియలేదు

ముంబైలోని జల్లెడ పడుతున్న అధికారులు.. 100 మంది ప్రయాణికుల జాడ తెలియలేదు

   6 hours ago


మధ్యప్రదేశ్ లో మత మార్పిడికి పాల్పడిందని పాఠశాలపై దాడి

మధ్యప్రదేశ్ లో మత మార్పిడికి పాల్పడిందని పాఠశాలపై దాడి

   7 hours ago


నాగాలాండ్ మరణాలపై కేంద్రం విచారం వ్యక్తం చేస్తుంది: అమిత్ షా

నాగాలాండ్ మరణాలపై కేంద్రం విచారం వ్యక్తం చేస్తుంది: అమిత్ షా

   a day ago


దేశంలో 21 ఒమిక్రాన్ కేసులు నమోదు, రాజస్థాన్‌లో ఎక్కువ

దేశంలో 21 ఒమిక్రాన్ కేసులు నమోదు, రాజస్థాన్‌లో ఎక్కువ

   06-12-2021


నాగాలాండ్‌లో ఘోరం: నక్సల్స్ అనుకుని భద్రతా దళం గ్రామస్తులపై దాడి.. 13 మంది మృతి

నాగాలాండ్‌లో ఘోరం: నక్సల్స్ అనుకుని భద్రతా దళం గ్రామస్తులపై దాడి.. 13 మంది మృతి

   05-12-2021


దేశంలో 3వ ఒమిక్రాన్ కేసు నమోదు.. జింబాబ్వే నుండి గుజరాత్‌కు వచ్చింది వ్యక్తికి పాజిటివ్

దేశంలో 3వ ఒమిక్రాన్ కేసు నమోదు.. జింబాబ్వే నుండి గుజరాత్‌కు వచ్చింది వ్యక్తికి పాజిటివ్

   04-12-2021


పిల్లలకు బూస్టర్ డోస్, వ్యాక్సిన్ లపై నిపుణుల అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వం

పిల్లలకు బూస్టర్ డోస్, వ్యాక్సిన్ లపై నిపుణుల అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వం

   04-12-2021


బెంగళూరులో ఒమిక్రాన్ వచ్చింది ఒక వైద్యుడుకి..

బెంగళూరులో ఒమిక్రాన్ వచ్చింది ఒక వైద్యుడుకి..

   03-12-2021


ఇండియాలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు

ఇండియాలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు

   02-12-2021


కోవిడ్-19 ఓమిక్రాన్ 15 దేశాలకు విస్తరించింది

కోవిడ్-19 ఓమిక్రాన్ 15 దేశాలకు విస్తరించింది

   02-12-2021


ఇంకా

Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle