దేశంలో కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 41,322 మందికి కరోనా
28-11-202028-11-2020 11:42:11 IST
Updated On 28-11-2020 12:17:58 ISTUpdated On 28-11-20202020-11-28T06:12:11.378Z28-11-2020 2020-11-28T06:10:04.471Z - 2020-11-28T06:47:58.459Z - 28-11-2020

భారతదేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం బులెటిన్ ను విడుదల చేసింది. గత 24 గంటల్లో 41,322 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,51,110 కి చేరింది. గత 24 గంటల్లో 41,452 మంది కోలుకున్నారు. గత 24 గంటల సమయంలో 485 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దేశంలో మొత్తం మృతుల సంఖ్య 1,36,200 కి పెరిగింది. కరోనా నుంచి ఇప్పటివరకు 87,59,969 మంది కోలుకున్నారు. 4,54,940 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది.
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం తెలంగాణలో గత 24 గంటల్లో 753 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 952 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,68,418కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,56,330 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,451కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 10,637 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 8,459 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 133 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 71 కేసులు నిర్ధారణ అయ్యాయి.
27-11-2020న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో 57,752 కరోనా పరీక్షలు నిర్వహించగా, 733 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 118 కేసులు రాగా, గుంటూరు జిల్లాలో 112, కృష్ణా జిల్లాలో 102 కేసులు వచ్చాయి. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 13 కేసులు గుర్తించారు. కర్నూలు జిల్లాలో 21, శ్రీకాకుళం జిల్లాలో 22, విజయనగరం జిల్లాలో 31, కడప జిల్లాలో 33 కేసులు వెల్లడయ్యాయి. 1,205 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకూ 8,66,438 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,47,325 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 12,137 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 6,976కి చేరింది.

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!
19 minutes ago

భర్తకు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు తల్లి
7 hours ago

వైట్ హౌజ్ కాదు.. వాషింగ్టన్ నే వదిలేస్తారట
5 hours ago

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్
8 hours ago

భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..
9 hours ago

ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు
10 hours ago

తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య
11 hours ago

భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..
11 hours ago

కాసేపట్లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్రపంచంలో మనమే టాప్
12 hours ago

ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..
15-01-2021
ఇంకా