newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

భార్యే భ‌ర్త‌కి భ‌ర‌ణం క‌ట్టాలి - కోర్టు చెప్పింది

24-10-202024-10-2020 16:00:49 IST
Updated On 24-10-2020 17:22:59 ISTUpdated On 24-10-20202020-10-24T10:30:49.020Z24-10-2020 2020-10-24T10:30:44.264Z - 2020-10-24T11:52:59.152Z - 24-10-2020

భార్యే భ‌ర్త‌కి భ‌ర‌ణం క‌ట్టాలి - కోర్టు చెప్పింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఎన్ని కేసులు చూశాం. ఎన్ని విన్నాం. చాలా మంది విడాకుల జోలికి వెళ్ల‌కుండా నెట్టుకొస్తుంటారు. ఎందుయ్యా అంటే.. ఇప్పుడు నేను భ‌ర‌ణం క‌ట్ట‌లేను. కోర్టుకెళ్తే భ‌ర‌ణం క‌ట్ట‌క త‌ప్ప‌దు. అందుకే.. ఎందుకొచ్చిన గోల‌రా అని భ‌రిస్తున్నాను అంటారు. విడిగా ఉండే భ‌ర్త‌లు కూడా భార్య‌ని విడాకులు అడ‌గ‌రు. చాలా కేసుల్లో ఇలాంటిది జ‌రుగుతుంటుంది. కానీ.. భార్యే భ‌ర్త‌కి భ‌ర‌ణం క‌ట్టాలి అన‌డం మాత్రం సమ్ థింగ్ డిఫ‌రెంటే క‌దా. అదీ కోర్టు చెప్పింది. ఇంకేముంది.. ఇదొక విచిత్ర‌మైన కేసు కిందే చూసి.. ఇలాంటి అప్లికేష‌న్లు ఎంత మంది చేసుకుంటారో ఇక ముందు. ఉల్లి ధరలు ధారికి వచ్చేనా?

విష‌యంలోకి వెళ్తే.. యూపీలోని ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ ఫ్యామిలీ కోర్టు ఈ తీర్పు చెప్పింది. భార్య భ‌ర్త‌లు విడాకులు తీసుకున్నార‌ట‌. ఇద్ద‌రూ ఏజ్ అయిపోయిన వాళ్లే. ఓల్డేజ్ కి వ‌చ్చారు. విడాకులు తీసుకున్నారు కూడా. కానీ.. భ‌ర్త కోర్టుకి విన్న‌వించుకున్న‌ది ఏంటీ అంటే.. నా ఏజ్ అయిపోయింది. నేను ఏ ప‌నీ చేయ‌లేను. ఈ వ‌య‌సులో నేను ఎలా బ‌త‌కాలి. నా భార్య నుంచి భ‌ర‌ణం ఇప్పించండి అని.. ఫ్యామిలీ కోర్టులో పిటిష‌న్ వేశాడు. ఈ పిటిష‌న్ ని ప‌రిశీలించిన ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ కోర్టు నెల నెలా భ‌ర్త‌కి వెయ్యి రూపాయ‌లు ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసింది. భార్యకి గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగం ఉంది. ఆమె రీసెంట్ గానే రిటైర్ అయ్యారు. సో.. ఆమెకు ఫించ‌న్ వ‌స్తుంది. ఆ ఫించ‌న్ నుంచి కొంత మొత్తం.. అంటే వెయ్యి రూపాయ‌లు ఇవ్వాల‌ని కోర్టు చెప్పింది.

ఏదెలా ఉన్నా.. ఇది నిజంగానే డిఫ‌రెంట్ కేసే. చాలా మంది ఇలాంటి పిటిష‌న్ లు వేయ‌రు. భ‌ర‌ణం అంటే భ‌ర్తే క‌ట్టాలి అని ఫిక్స్ అవుతారు. కానీ.. హిందూ చ‌ట్టంలో ఇలాంటి పాయింట్ కూడా ఉంద‌ని కోర్టు ప్రూవ్ చేసింది. భ‌ర్తే కాదు.. భార్య కూడా భ‌ర్త‌కి భ‌ర‌ణం క‌ట్టాల్సి వ‌స్తుంది. ఇది కేవ‌లం ఎవ‌రి పొజిష‌న్ మంచిగా ఉంది.. ఎవ‌రి పొజిష‌న్ మంచిగా లేదు అనే దానిపైనే ఆధార‌ప‌డి ఉంటుంది అని క్లారిటీ ఇచ్చింది.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle