newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సిద్ధమవుతున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు

19-04-202119-04-2021 11:15:46 IST
Updated On 19-04-2021 11:19:54 ISTUpdated On 19-04-20212021-04-19T05:45:46.565Z19-04-2021 2021-04-19T05:28:37.022Z - 2021-04-19T05:49:54.541Z - 19-04-2021

సిద్ధమవుతున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కోవిడ్ వ్యాధి గ్రస్తులకు ఆక్సిజన్ కొరత ప్రధాన సమస్యగా మారడంతో రైల్వేలు ఈ ప్రాణవాయు సరఫరా బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాయి. విశాఖ, జంషెడ్పూర్, రూర్కెలా, బొకారో వంటి ప్రాంతాల నుంచి ఆక్సిజన్ లోడ్ లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాయి. రానున్న కొన్ని రోజుల పాటు అన్ని అవసర ప్రాతాలకు ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లను నడుప బోతున్నట్లు రైల్వేలు ప్రకటించాయి. ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ తో పాటు ఆక్సిజన్ సిలిండర్లను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు రవాణా చేయబోతున్నట్లు ఆదివారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత అత్యధిక స్థాయికి చేరుకోవడంతో మెడికల్ ఆక్సిజన్ కొరత ఆందోళనకర స్థాయికి చేరుకుంది.

విశాఖ, జంషెడ్పూర్, రూర్కెలా, బొకారో తదితర ప్రాంతాల నుంచి మెడికల్ ఆక్సిజన్ తీసుకురావటానికి ఖాళీ ట్యాంకర్లను పంపనున్నట్లు సోమవారం ముంబై తదితర ప్రాంతాల నుంచి ఈ ట్యాంకర్లు బయలుదేరుతాయని అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ద్రవరూపంలో ఉన్న ఆక్సిజన్ కోసం అభ్యర్ధించాయని వాటి అభ్యర్ధనను దృష్టిలో పెట్టుకునే ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లను నడపాలన్న ఆలోచనకు వచ్చామని అధికారులు తెలిపారు.

18 ఏళ్ళు దాటితే కోవిడ్ టీకా వేయాలి.. సుప్రీంకోర్టులో పిటీషన్

అయితే ఈ ఆక్సిజన్ రవాణా చేయడం అన్నది అనేక జాగ్రత్తలతో కూడుకున్న వ్యవహారం కాబట్టి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మొదటి ఖాళి ట్యాంకర్లు సోమవారం బయలుదేరుతాయని, రానున్న కొన్ని రోజులలోనే ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ఆపరేషన్ మొదలవుతుందని అధికారులు తెలిపారు. ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నిరాటంకంగా నడిపేందుకు గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడ డిమాండ్ ఉన్నా అక్కడికి తక్షణమే తరలించగలుగుతామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి రైల్వే బోర్డు అధికారులకు, రాష్ర రవాణా కమిషనర్లకు చర్చలు జరిగాయి. దీని ప్రాతిపదికగానే ఆక్సిజన్ రవాణాకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల తీవ్రతకు ఈ ఆక్సిజన్ కొరత కూడా తోడు కావడంతో పరిష్టితి ఒక్కసారిగా విషమ స్థితికి చేరుకుంది. కోవిడ్ రెండవ దశ అతి తక్కువ కాలంలోనే అనూహ్య తీవ్రతను సంతరించుకోవడంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలు నివారణ, నిరోధక చర్యలను చేపట్టాయి. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వైద్యపరంగా కూడా ఎలాంటి కొరత లేకుండా చేసేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నాయి. సోమవారం నుంచి ఈ ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు కూడా అందుబాటులోకి రానున్నందున పరిస్థితి కొంతమేర మెరుగుపడే అవకాశం ఉందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.    

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

   9 hours ago


నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   15 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   a day ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   a day ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13-05-2021


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle