newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

టీకా తయారీ ఈ స్థాయికి చేరినందుకు గర్విస్తున్నా... ప్రధాని మోదీ

29-11-202029-11-2020 10:35:34 IST
2020-11-29T05:05:34.275Z29-11-2020 2020-11-29T05:04:38.622Z - - 16-01-2021

టీకా తయారీ ఈ స్థాయికి చేరినందుకు గర్విస్తున్నా... ప్రధాని మోదీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో టీకా తయారీ ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయికి చేరినందుకు గర్విస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. టీకా అభివృద్ధి కార్యక్రమంలో దేశం శాస్త్రీయ సిద్ధాంతాలపై ఆధారపడిందని, టీకా పంపిణీ సమర్థంగా జరిగేందుకు సలహా, సూచనలు ఇవ్వాలని కోరారు. ఆరోగ్యంతోపాటు లోక కల్యాణానికి టీకా కీలకమని భారత్‌ భావిస్తోందని వ్యాఖ్యానించారు. కరోనాపై పోరులో ఇరుగుపొరుగుతోపాటు ఇతర దేశాలకు సాయం అందించడం మన ధర్మమన్నారు. దేశంలో డ్రగ్‌ రెగ్యులేటరీ పద్ధతులను మరింత మెరుగుపరిచేందుకు శాస్త్రవేత్తలు స్వేచ్ఛగా, నిష్కర్షగా అభిప్రాయాలు తెలపాలని సూచించారు. 

కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న వేళ టీకా పురోగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సమీక్షించారు. శనివారం వరసగా మూడు నగరాల్లో టీకా తయారీ కేంద్రాలను సందర్శించారు. అహ్మదాబాద్‌లోని జైడస్‌ బయోటెక్‌ పార్క్, హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్, పుణే లోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలకు వెళ్లారు. అక్కడ శాస్త్రవేత్తలను కలుసుకొని మాట్లాడారు.

వ్యాక్సిన్‌ ప్రయోగాలు, డోసుల ఉత్పత్తి, టీకా పంపిణీలో సవాళ్లను అధిగమించేలా జరుగుతున్న ఏర్పాట్లపై నేరుగా సమాచారాన్ని తెలుసుకోవడం కోసమే ప్రధాని మోదీ ఈ పర్యటన చేపట్టారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత్‌ దేశీయంగా రూపొందిస్తున్న జైకోవ్‌–డీ, కొవాగ్జిన్‌ టీకాలపై పరిశోధనలు అత్యంత వేగంగా సాగుతూ ఉండడం దేశానికే గర్వ కారణమని ప్రధాని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ ప్రజలందరికీ చేరేలా మెరుగ్గా పంపిణీ చేయడానికి పలు సూచనల్ని కూడా శాస్త్రవేత్తలను అడిగి ప్రధాని తెలుసుకున్నారు.  

ఈ సందర్భంగా కరోనాను ఎదుర్కొనే విషయంలో ఎలా కొత్త మందులు తయారు చేస్తున్నదీ... పాత మందులను కరోనా కట్టడి కోసం ఎలా మారుస్తున్నదీ శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు సిద్ధం చేస్తున్న కోవిషీల్డ్‌ టీకాను పుణేలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా పెద్ద ఎత్తున తయారు చేస్తున్న విషయం తెలిసిందే. 

అతిపెద్ద ప్రయోగం భారత్‌ బయోటెక్‌ 

కోవాగ్జిన్‌ టీకాపై ప్రస్తుతం జరుగుతున్న మూడో దశ మానవ ప్రయోగాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జరుగుతున్న అతిపెద్ద కోవిడ్‌ టీకా ప్రయోగమని భారత్‌ బయోటెక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా సుమారు 25 కేంద్రాల్లో 26,000 మంది వలంటీర్లకు టీకా ఇస్తున్నామని, జినోమ్‌ వ్యాలీలోని బీఎస్‌ఎల్‌–3 స్థాయి కేంద్రంలో వ్యాక్సిన్‌ తయారవుతోందని కంపెనీ తెలిపింది. ప్రధాని మోదీ తమ ఫ్యాక్టరీని సందర్శించడంపై భారత్‌ బయోటెక్‌ హర్షం వ్యక్తం చేసింది. టీకా తయారీలో నిమగ్నమైన శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బందికి ప్రధాని పర్యటన స్ఫూర్తినిస్తుందని, ప్రజారోగ్య సమస్యల పరిష్కారంలో తమ నిబద్ధతను మరింత పెంచుతుందని భారత్‌ బయోటెక్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

టీకా అత్యవసర వాడకానికి త్వరలో దరఖాస్తు

కరోనా వైరస్‌ నియంత్రణకు ఆస్ట్రాజెనెకా–ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను ఇండియాలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) నిర్వహిస్తోంది. ఈ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికిగాను రానున్న రెండు వారాల్లో డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియాకు దరఖాస్తు చేయనున్నట్లు ఎస్‌ఐఐ సీఈఓ ఆదార్‌ పూనావాలా శనివారం చెప్పారు. ఎమర్జెన్సీ యూజ్‌ లైసెన్స్‌ వచ్చిన తర్వాతే వ్యాక్సిన్‌ పంపిణీ సాధ్యమవుతుందన్నారు. ఇందుకోసం అవసరమైన డేటాను త్వరలో ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఆస్ట్రాజెనెకా–ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను తొలుత భారత్‌లో, అనంతరం ఆఫ్రికా దేశాల్లో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!

   21 minutes ago


భ‌ర్త‌కు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు త‌ల్లి

భ‌ర్త‌కు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు త‌ల్లి

   7 hours ago


వైట్ హౌజ్ కాదు.. వాషింగ్ట‌న్ నే వ‌దిలేస్తారట

వైట్ హౌజ్ కాదు.. వాషింగ్ట‌న్ నే వ‌దిలేస్తారట

   5 hours ago


ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్

   8 hours ago


భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..

భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..

   9 hours ago


ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు

ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు

   10 hours ago


తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య

తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య

   11 hours ago


భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..

భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..

   11 hours ago


కాసేప‌ట్లో క‌రోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్ర‌పంచంలో మ‌న‌మే టాప్

కాసేప‌ట్లో క‌రోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్ర‌పంచంలో మ‌న‌మే టాప్

   12 hours ago


ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..

ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..

   15-01-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle