newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

వైరస్ ముప్పు ఇంకా వేటాడుతోంది జాగ్రత్త. ప్రధాని మోదీ

14-10-202014-10-2020 08:52:27 IST
2020-10-14T03:22:27.094Z14-10-2020 2020-10-14T03:22:21.133Z - - 21-10-2020

వైరస్ ముప్పు ఇంకా వేటాడుతోంది జాగ్రత్త. ప్రధాని మోదీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆరునెలల సమరం తర్వాత కూడా కరోనా వైరస్ దేశాన్ని, ప్రజలను ఇంకా వెంటాడుతుూనే ఉందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు మంగళవారం రెండు నెలల కనిష్టస్దాయిలో నమోదైన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహమ్మారిపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. వ్యాక్సిన్‌ బయటకు వచ్చే వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భౌతిక దూరం పాటించడం వంటి కోవిడ్‌-19 నిబంధనలను విధిగా పాటించాలని వైరస్‌ ముప్పు మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉందని అన్నారు.

కేంద్ర మాజీ మంత్రి బాలాసాహెబ్‌ విఖే పాటిల్‌ ఆటోబయోగ్రఫీని విడుదల చేసిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించరాదని కోరారు. కరోనా వైరస్‌ ప్రమాదం ఇంకా కొనసాగుతోందని, మహారాష్ట్రలో పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని వ్యాక్సిన్‌ వచ్చేవరకూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 55,342గా నమోదైంది. ఆగస్ట్‌ 18 తర్వాత కేసుల సంఖ్య ఈరోజు అతితక్కువగా నమోదైంది. గత నెలలో 90,000కు పైగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నమోదవగా తాజాగా ఆ సంఖ్య సగానికి పడిపోయింది. ఇక తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 71.75 లక్షలకు చేరగా మరణించిన వారి సంఖ్య 1,09,856గా నమోదైంది. 

వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్‌.. కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

భారత్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో కరోనా వైరస్‌ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్‌ పేర్కొన్నారు. దేశంలో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ పంపిణీకి అవసరమైన వ్యూహాలను నిపుణుల బృందాలు రూపొందిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్‌ లేదా వచ్చే ఏడాది ఆరం​భంలో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ ప్రపంచం ముందుకు వస్తుందని ఆశిస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంత్రుల బృందం భేటీలో మంత్రి భారత్‌లో వ్యాక్సిన్‌ అందుబాటు, పంపిణీ అంశాలపై ఈ వ్యాఖ్యలు చేశారు. 

వ్యాక్సిన్‌పై డబ్ల్యూహెచ్‌ఓ అంచనా

ఈ ఏడాది చివరి నాటికి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ సిద్ధమవుతుందని డబ్ల్యూహెచ్‌ఓ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 40 కరోనా వైరస్‌ వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉండగా వాటిలో 10 వ్యాక్సిన్‌లు కీలక మూడవ దశలో ఉన్నాయని వీటి భద్రత, సామర్ధ్యం మనకు వెల్లడి కావాల్సి ఉందని అన్నారు. ఈ వ్యాక్సిన్లు కీలక దశలను దాటుకుని తగినంత డేటాతో రెగ్యులేటర్ల అనుమతి పొందే ప్రక్రియ ముగియాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఈ అంశాల ఆధారంగా చూస్తే ఈ ఏడాది డిసెంబర్‌ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్‌ ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle