newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

14-05-202114-05-2021 16:03:49 IST
2021-05-14T10:33:49.107Z14-05-2021 2021-05-14T10:12:11.430Z - - 14-06-2021

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఢిల్లీ: యావద్భారతాన్ని వణికిస్తున్న కోవిడ్ కేసుల తీవ్రత ఇంకా ఎంత కాలం ఉంటుంది? ఇటు మందులు, అటు ఆక్సిజన్లు లేకపోవడంతో ఈ వైరస్ నిత్యం వెంటాడుతూనే ఉంటుందా అన్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో కేంబ్రిడ్జి ట్రాకర్ ఊరట కలిగించే సంకేతాలను అందించింది. ఇప్పటికే ఈ కేసులు భారత్ లో పరాకాష్టకు చేరుకున్నాయని, ఈ నెల చివరి వారంలో కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే భారత దేశంలో అన్నిచోట్లా ఈ వైరస్ తీవ్రత ఒకే విధంగా లేనందున దాని విస్తృతి ఒక పట్టనా  అంతుబట్టడం లేదని పేర్కొంది.   

అయితే దేశమంతా కాకపోయినా అస్సాం, హిమాచల్, జమ్మూ కాశ్మీర్, మిజోరాం, మేఘాలయ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలలో రానున్న రెండు వారాలలో ఈ కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. భారత ఆర్ధిక, సామాజిక పరిశోధనా సంస్థతో కలసి పిజెబిఎస్ ఈ అంచనాలను వెలువరించింది. ఇటీవల అభివృద్ధి చేసిన కోవిడ్ వైరస్ నమూనాల ఆధారంగా ఈ వైరస్ తీవ్రతకు సంబంధించి ఎప్పటికప్పుడు అంచనాలను ఈ సంస్థ వెలువరిస్తోంది. ఓ పక్క కోవిడ్ వైరస్ ను అరికట్టేందుకు అనేక రకాలుగా మందులు ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఇవి అంతటా లభ్యమైతే వ్యాధి తీవ్రతను తగ్గించుకునే అవకాశం ఉంటుందని వెల్లడించింది. కేవలం ప్రభుత్వ పరమైన వివరాలనే కాకుండా ఇతరత్రా  తాము సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ఈ సంస్థ తన అంచనాలను వెల్లడించింది. 

ప్రస్తుతం భారత్ లో వ్యాపిస్తున్న కరోనా వైరస్ అత్యంత తీవ్రమైనది కావడం వల్ల దాని ప్రభావం దేశమంతటా ఉందని తెలిపింది. అంతేకాకుండా శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచే  కొన్ని రకాల ప్రతి రక్షకాలను కూడా బలహీనపరిచే శక్తి దీనికి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ ను పూర్తి స్థాయిలో అణచివేయడానికి కోవిషీల్డ్, కొవ్యాక్సిన్ సహా అనేక వ్యాక్సిన్ల లభ్యతను ప్రభుత్వం పెంచుతోంది. అలాగే అన్ని వయసుల వారికి టీకాలను అందుబాటులోకి తెచ్చేందుకు గట్టి కృషి చేస్తోంది. ఈ ప్రయత్నాలన్నింటి ఫలితంగా కోవిడ్ వ్యాధి తీవ్రత ఈ నెలాఖరులోగా తగ్గగలదన్న అంచనాలు ఈ సంస్థ వెల్లడించింది. 

ఇప్పటి వరకు వచ్చిన వైరస్ ల కంటే కూడా కోవిడ్  రెండవ దశ దేశంలో ఇంత భయోత్పాతాన్ని సృష్టించడానికి కారణం కూడా దాని తీవ్రతను సకాలంలో గుర్తించకపోవడమేనని చెబుతున్నారు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు టీకాల కార్యక్రమాన్ని ఉద్ధృతం చేయడం, ఇతరత్రా మందులను అందుబాటులోకి తేవడం వంటి చర్యలు ఖచ్చితంగా సత్ఫలితాలు ఇవ్వగలవన్న ధీమా నిపుణులలో వ్యక్తమవుతోంది. ఇప్పుడు అనేక అంశాలను పరిశీలించిన మీదట కేంబ్రిడ్జి ట్రాకర్కూ డా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.  

కోవిడ్ -19: అంబులెన్స్‌పై జిఎస్‌టి 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు: నిర్మలా సీతారామన్

కోవిడ్ -19: అంబులెన్స్‌పై జిఎస్‌టి 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు: నిర్మలా సీతారామన్

   18 minutes ago


అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

   an hour ago


బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   6 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   21 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle