newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా..?

29-09-202029-09-2020 13:25:22 IST
Updated On 29-09-2020 13:35:30 ISTUpdated On 29-09-20202020-09-29T07:55:22.656Z29-09-2020 2020-09-29T07:55:04.756Z - 2020-09-29T08:05:30.694Z - 29-09-2020

కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

హైదరాబాద్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కరోనా  వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందా..? ఒక వేళ వ్యాపిస్తే ఎంత దూరం వ్యాపిస్తుందా అన్న విషయమై పరిశోధనలు చేపట్టారు. వైరస్‌ గాలి ద్వారా ఎంత దూరం వరకు విస్తరిస్తుందన్న విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు కనుక్కోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అందు కోసమే ఎయిర్‌ శాంపిల్‌ సర్వే మొదలు పెట్టారు. ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సర్వే నిర్వహిస్తున్నారు.  ప్రత్యేకంగా అమెరికా నుంచి ఆధునిక ఎయిర్‌ టంప్లరీ యంత్రాన్ని తెప్పించారు. ఆస్పత్రుల పరిసరాల్లో పాజిటివ్‌ ఉన్న వ్యక్తుల నుంచి వైరస్‌ ఎలా వ్యాప్తిస్తుందన్న అంచనా వేసేందుకు ఈ పరిశోధనలు చేపట్టినట్లు సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు.  

గాలిలో వైరస్‌ వ్యాప్తి చెందుతుందని చెప్పడానికి తమ వద్ద ఆధారాలున్నాయని దాదాపు 200 మందికిపైగా శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించారు. అమెరికాలోని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) కూడా గాలిలో వైరస్‌ వ్యాప్తి ఉండవచ్చన్న ప్రాథమిక నిర్ధారణలతో పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ తరుణంలో సీసీఎంబీ చేపట్టిన తాజా పరిశోధన ఆసక్తికరంగా మారింది. 

జనం గుమిగూడి ఉండే ప్రదేశాల్లోనూ సర్వే నిర్వహిస్తామని, పది రోజుల్లో ప్రాథమిక అవగాహనకు వస్తామని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. ఈ సర్వేతో వైద్యులు,ఆరోగ్య సిబ్బంది, ఇతర వ్యక్తులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. 

భారత దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 70,589 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య  61 లక్షల 45 వేలకు చేరింది. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా కారణంగా మొత్తం 776  మంది మృతి చెందగా.. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 84,877 డిశ్ఛార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 96,318 మృతి చెందగా.. మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 51,01,397కి పెరిగింది. దేశ వ్యాప్తంగా  9,47,576యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

 


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle