మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!
16-01-202116-01-2021 20:33:02 IST
2021-01-16T15:03:02.398Z16-01-2021 2021-01-16T15:02:58.962Z - - 09-03-2021

భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్ మొదలైన సంగతి తెలిసిందే. కానీ ప్రజల్లో అపోహలు మొదలవుతూ ఉన్నాయి. ఈ అపోహలను పోగొట్టాలంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇంతకూ ఈ డిమాండ్ చేసింది ఎవరంటే.. వంచిత్ బహుజన్ అఘాడి నేత ప్రకాశ్ అంబేద్కర్..!
వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా ప్రజల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని.. వ్యాక్సిన్ తీసుకోవడానికి తాను కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలకు మద్దతు పలుకుతూ మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను చేపట్టనున్నట్టు చెప్పారు. షహీన్ బాగ్ ఆందోళనల సమయంలో సిక్కులు మద్దతు పలికారని... ఇప్పుడు రైతుల ఆందోళనలకు ముస్లింలు అండగా ఉంటారని తెలిపారు. రైతులకు అండగా నిలవడంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ విఫలమయ్యాయని ఆరోపించారు. కరోనా వ్యాక్సిన్ మీద తమకు అనుమానాలు ఉన్నాయని పలు పార్టీల నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అనుమానాలు పటాపంచలు అవ్వాలంటే మోదీ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రకాశ్ అంబేద్కర్ సూచిస్తూ ఉన్నారు.
భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై మోదీ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూసిందని చెప్పారు. వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులే వ్యాక్సిన్ తొలి హక్కుదారులని మోదీ అన్నారు. వ్యాక్సిన్ల తయారీ కోసం చాలా మంది విశ్రాంతి లేకుండా శ్రమించారని.. వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడ్డారని అన్నారు. అతి తక్కువ సమయంలో వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారని మోదీ తెలిపారు. శాస్త్రవేత్తల కృషికి ఫలితంగా దేశంలో రెండు వ్యాక్సిన్లు వచ్చాయని.. మరికొన్ని వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తాయని అన్నారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరని తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు చూపిన ధైర్యాన్ని ఇప్పుడు కూడా చూపాలని తెలిపారు. తొలి విడతలో మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని వివరించారు. రెండో విడతలో 30 కోట్ల మందికి వేస్తామని అన్నారు. దేశీయ వ్యాక్సిన్ తయారీలో భారత సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసిందని మోదీ తెలిపారు.

వ్యాక్సిన్ పాలసీకి భారత్ కట్టుబడింది.. IMF చీప్ గీతా గోపీనాథ్ ప్రశంస
26 minutes ago

ఇంతకూ ఆ 5 కోట్లు నాకెవరిచ్చారబ్బా... తాప్సీ బిగ్ జోక్
2 hours ago

అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని కోరిన మహిళా ఎంపీ
17 hours ago

73 ఏళ్ల పెద్దాయనకు పెళ్లి మోజు.. కోటి 30 లక్షలతో అమ్మాయి జంప్
17 hours ago

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,599 మందికి కరోనా
08-03-2021

ప్రపంచానికి భారత్ ఇచ్చిన వరం వ్యాక్సిన్లు.. అమెరికా సైంటిస్టు ప్రశంసలు
08-03-2021

ఈ ఏడాదికి.. నారీ వారియర్ గా నామకరణం చేద్దాం
08-03-2021

దీదీపై మోదీ సెటైర్లు..!
07-03-2021

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 18,711 మందికి కరోనా..!
07-03-2021

కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు... ఐటీదాడులపై తాప్సీ
07-03-2021
ఇంకా