ఇవ్వాళ జిల్లా కేంద్రాలకు కరోనా టీకా.. వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవట
13-01-202113-01-2021 08:07:16 IST
2021-01-13T02:37:16.427Z13-01-2021 2021-01-13T02:36:58.033Z - - 17-01-2021

వ్యాక్సిన్ వ్యాక్సిన్ వ్యాక్సిన్.. టీకా టీకా టీకా అని కలలు కన్నం. వచ్చిందిక. కాకపోతే కరోనా అంతా పోయాక వచ్చింది. ఏమోలే.. ఇప్పటి దాకా ఉంటే ఎంతో రిలీఫ్ ఉండేది కదా. ఇప్పుడైనా టీకా వేయించుకుంటే.. ఈసారి రాకుండా.. కరోనా గురించి టెన్షన్ పడకుండా అయినా ఉండొచ్చు కదా. ఎప్పటి నుంచో అనుకుంటున్న కరోనా టీకా.. మొత్తానికైతే మన దాకా వచ్చింది. అన్ని పర్మిషన్లు తీసుకుని.. పూణే నుంచి హైదరాబాద్ కు చేరుకుంది. కరోనా మహమ్మారిని బొంద పెట్టాలని.. పుణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ తయారు చేశారు.
అన్ని రకాల ప్రయోగాలు పర్మిషన్లు పూర్తయ్యాక.. నిన్న కార్గో విమానాల్లో హైదరాబాద్ చేరుకుంది కోవిషీల్డ్. ఇక పంచడమే నెక్స్ట్. భారీ బందో బస్తు మధ్య.. కోఠిలోని సెంట్రల్ డ్రగ్ స్టోరేజీ సెంటర్ లో భద్ర పరిచారు. ఒక్కో బాక్సులో 12 వేల డ్రగ్ డోసులు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వ్యాక్సిన్ వేసే ప్రాసెస్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు మానిటరింగ్ చేశారు.. నిబంధనలు పాటిస్తూ వేస్తున్నారా లేదా అని చెక్ చేసుకుంటారు. ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్న వారిపై ఎలాంటి రియాక్షన్స్ ఇస్తుంది అనే విషయంపైనా ఆరా తీస్తారు. ఇక ఇవ్వాళ అన్ని జిల్లాలకు తరలిపోనుంది కరోనా వ్యాక్సిన్. రీజనల్ డ్రగ్ స్టోరీలో ఈ వ్యాక్సిన్ ను భద్ర పరుస్తారు.
ఇక టీకా వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా కామన్, కోవిడ్ టీకా వేసుకోగానే కరోనా తగ్గిపోవడమో.. ప్రపంచం మారి పోవడమో ఏం జరగదు. ఏది ఎట్టా ఉన్నా.. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం తప్పవు. ఈ విషయాన్ని సీరం వాళ్లే చెబుతున్నారు. వెరీ కామన్, కామన్, అన్ కామన్ అని.. మూడు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని ముందే హెచ్చరించింది సీరం ఇన్ స్టిట్యూట్. వాటన్నీటికీ ప్రిపేర్ అయిన వాళ్లు మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవాలి.
వెరీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటయ్యా అంటే
నొప్పి, దురద, వాపు అలసట, తలనొప్పి, జ్వరం వచ్చిన ఫీలింగ్ కలగడం, జాయింట్ పెయిన్స్, కండరాల నొప్పి, ఏదో జబ్బు చేసిన ఫీలింగ్ ఉండడం.. చాలా చాలా కామన్.. వేసుకున్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు.
కామన్ సైడ్ ఎఫెక్ట్స్
ఇంజక్షన్ వేసిన దగ్గర గడ్డ కట్టడం, వాంతులు, జ్వరం రావడం, బాడీ టెంపరేచర్ పెరగడం, ముక్కూ కారడం, గొంతు మంట లేదంటే నొప్పి రావడం, దగ్గు రావడం లాంటివి కామన్ సైడ్ ఎఫెక్ట్స్.
అన్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్
మత్తెక్కడం, పొత్తి కడుపులో నొప్పి, ఆకలి తగ్గడం, చెమట రావడం, చర్మంపై ర్యాషెస్ రావడం, విపరీతమైన దురద రావడం లాంటివి అన్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ వీటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయినా సరే.. ఎలాంటి భయాలు అక్కర్లేదు.. ఏమీ కాదు అంటూ భరోసా ఇస్తున్నారు డాక్టర్లు.

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!
6 hours ago

భర్తకు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు తల్లి
13 hours ago

వైట్ హౌజ్ కాదు.. వాషింగ్టన్ నే వదిలేస్తారట
11 hours ago

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్
14 hours ago

భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..
15 hours ago

ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు
15 hours ago

తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య
17 hours ago

భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..
17 hours ago

కాసేపట్లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్రపంచంలో మనమే టాప్
17 hours ago

ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..
15-01-2021
ఇంకా