newssting
Radio
BITING NEWS :
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్లకు పైగా నష్టపోయి 14,883 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. * కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర - ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో హై అలర్ట్. తెలంగాణ సరిహద్దుల్లో కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు. ములుగు జిల్లాకు వచ్చే వలస కూలీల విషయంలో అప్రమత్తమైన అధికారులు. పని ప్రదేశాల్లో మాస్క్ లేని కూలీలకు నో ఎంట్రీ. * ఎస్వీబీసీ ట్రస్ట్ కు భారీ విరాళం. రూ.9 కోట్ల విరాళం ఇచ్చిన పోస్కో గ్రూప్ అధినేత సంజయ్ పస్సి. టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డికి డీడీ అందజేత. * జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడి దాడి. అధిక శబ్దం చేస్తూ వెళ్తున్న బైక్ ను అడ్డుకున్న పోలీసులు. బైక్ ను ఆపినందుకు స్నేహితులతో కలిసి ట్రాఫిక్ సీఐ ముత్తు, సిబ్బందిపై దాడి. నిందితుడు దర్వేజ్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * మాదాపూర్ కు చెందిన వ్యాపారిని కిడ్నాప్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అమర్నాథ్ ను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కిడ్నాప్ అనంతరం అమర్నాథ్ భార్యకు ఫోన్ చేసి రూ.4 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. అనంతరం 80 ఫోన్ కాల్స్ చేసిన గ్యాంగ్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అరెస్ట్. * ఏపీలో రేపట్నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటన. మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్న నిమ్మగడ్డ.

కాసేప‌ట్లో క‌రోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్ర‌పంచంలో మ‌న‌మే టాప్

16-01-202116-01-2021 09:12:35 IST
Updated On 16-01-2021 11:11:20 ISTUpdated On 16-01-20212021-01-16T03:42:35.630Z16-01-2021 2021-01-16T03:42:31.778Z - 2021-01-16T05:41:20.362Z - 16-01-2021

కాసేప‌ట్లో క‌రోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్ర‌పంచంలో మ‌న‌మే టాప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టైం లేదు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఏడాది కాలంగా ఏడిపిస్తున్న క‌రోనాకి చెక్ పెట్టే టైం వ‌చ్చింది. ఇన్నాళ్ల పాటు డాక్ట‌ర్లు.. సైంటిస్టులు ప‌డ్డ క‌ష్టానికి ప్ర‌తి ఫ‌లం రానుంది. ఇక పై కాస్త రిలీఫ్ గా ఉండే టైం వ‌చ్చింది. దానికి అంతా రెడీ అయింది. దేశం మొత్తం క‌రోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోంది. దీంతో పాటు.. ఓ రికార్డ్ కూడా మ‌న దేశానికి సొంతం కానుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇవాళ భారత్‌లో ప్రారంభం కాబోతోంది. దేశ వ్యాప్తంగా మొత్తం 3 వేల 6 కేంద్రాలలో టీకాలు వేసే కార్యక్రమం కాసేప‌ట్లో స్టార్ట్ కానుంది. ఈ ప్రాసెస్ లో టీకాలు వేసే కేంద్రాల సంఖ్య 5 వేలకు పైగానే పెరిగే అవకాశం ఉంది. దేశంలో మొత్తం 12 నగరాలకు ఇప్పటికే చేరుకున్న కరోనా వాక్సిన్ ను.. లోక‌ల్ కేంద్రాల‌కు తరలించారు. వాక్సిన్ నిల్వలు, వాటి ఉష్ణోగ్రతలు, టీకా తీసుకున్న వారి ఖచ్చితమైన సమాచారాన్ని తీసుకునేందుకు కోవిన్ అనే యాప్ ను రూపొందించింది కేంద్ర ఆరోగ్య శాఖ. వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి 24 గంటలు సమాచారం అందించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం 1075 నెంబరు తో హాట్ లైన్ ఏర్పాటు చేసింది. 

ఇక టీకా ప్రారంభానికి కూడా సెట‌ప్ అంతా రెడీగా ఉంది. అధికారులు హ‌డావిడిగా ఉన్నారు. కాసేప‌ట్లోనే ప్రారంభం కానుండ‌డంతో.. ఉరుకులు ప‌రుగులు అన్న‌ట్లు ఉంది ఎవ్వారం. ప్ర‌తి విష‌యాన్ని ప‌ది సార్లు చెక్ చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. సీనియ‌ర్ ఆఫీస‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఏర్పాట్లు న‌డుస్తున్న‌య్. ఎందుకంటే.. కాసేప‌ట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు ఉదయం 10.30 గంటలకు దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. 

ఇక, ప్రతి కేంద్రంలోనూ 100 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి ఇవాళ వ్యాక్సిన్‌ అందించనున్నారు.. వచ్చే కొద్ది వారాలలో కోటి మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి అందనుంది ఈ వ్యాక్సిన్‌.. గర్భిణీ స్త్రీలు, పిల్ల తల్లులకు వాక్సిన్ ఇవ్వరాదని కేంద్రం స్పష్టం చేసింది. ఏదైనా ఇంజక్షన్లు, ఔషధాలు తీసుకుంటే, అలర్జీ వచ్చే వాళ్లకు కూడా వాక్సిన్ ఇవ్వరాదని గైడ్‌లైన్స్‌లో పేర్కొంది. వాక్సిన్ తీసుకుంటే జరుగుతున్న వైద్య చికిత్స నిలుపుదల చేయాలనే నిబంధన ఉంటే కూడా వాక్సిన్ తీసుకోరాదని స్పష్టం చేసింది. మొత్తంగా ప్రపంచంలో ఏ దేశంలో జరగని విధంగా భారత్‌లో ఈ వ్యాక్సినేషన్‌ జరగబోతోంది. వ్యాక్సిన్‌ పంపిణీలోనూ భారత్‌కు ప్రత్యేక స్థానం ఉన్నసంగతి తెలిసిందే.

కరోనా అప్డేట్.. గత 24 గంటల్లో 16,488 మందికి కరోనా

కరోనా అప్డేట్.. గత 24 గంటల్లో 16,488 మందికి కరోనా

   an hour ago


కొరియన్ బ్యాండ్‌పై హోస్ట్ జాతి వివక్షా వ్యాఖ్యలు.. జర్మన్ రేడియో క్షమాపణ

కొరియన్ బ్యాండ్‌పై హోస్ట్ జాతి వివక్షా వ్యాఖ్యలు.. జర్మన్ రేడియో క్షమాపణ

   an hour ago


కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ.. పెరుగుతున్న కరోనా కేసులు

కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ.. పెరుగుతున్న కరోనా కేసులు

   2 hours ago


ఎన్నికల షెడ్యూల్ ఇదే..!

ఎన్నికల షెడ్యూల్ ఇదే..!

   13 hours ago


భారత్ పాక్ కాల్పుల విరమణ.. సూత్రధారి దోవల్

భారత్ పాక్ కాల్పుల విరమణ.. సూత్రధారి దోవల్

   21 hours ago


కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 16,577 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 16,577 మందికి కరోనా..!

   20 hours ago


గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు బైడెన్ గ్రీన్ సిగ్నల్

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు బైడెన్ గ్రీన్ సిగ్నల్

   a day ago


మోదీ.. ఉద్యోగమివ్వు.. 50 లక్షల ట్వీట్లతో ట్విట్టర్‌లో ట్రెండింగ్

మోదీ.. ఉద్యోగమివ్వు.. 50 లక్షల ట్వీట్లతో ట్విట్టర్‌లో ట్రెండింగ్

   26-02-2021


టీ చేయకపోతే చావగొడతారా.. భార్య అంటే వస్తువా.. ధ్వజమెత్తిన హైకోర్టు

టీ చేయకపోతే చావగొడతారా.. భార్య అంటే వస్తువా.. ధ్వజమెత్తిన హైకోర్టు

   18 hours ago


అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు ఉన్న వాహనం

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు ఉన్న వాహనం

   26-02-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle