newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

18 సంవత్సరాలు నిండిన వారంతా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.. రాష్ట్రాలు నేరుగా టీకాలు కొనుక్కోవచ్చు

20-04-202120-04-2021 09:16:51 IST
Updated On 20-04-2021 09:38:02 ISTUpdated On 20-04-20212021-04-20T03:46:51.641Z20-04-2021 2021-04-20T03:46:49.068Z - 2021-04-20T04:08:02.265Z - 20-04-2021

18 సంవత్సరాలు నిండిన వారంతా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.. రాష్ట్రాలు నేరుగా టీకాలు కొనుక్కోవచ్చు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించాలని నిర్ణయించింది. మే 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారులతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు.. ఆ సమావేశాలు ముగిసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. కరోనా ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తుండగా.. దీన్ని అడ్డుకోవడానికి వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం ఒక్కటే మార్గమని నిపుణులు సూచించారు. దీంతో 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించేందుకు కేంద్రం ఆమోదం తెలపాలన్న డిమాండ్‌ వినిపించింది. పరిస్థితి తీవ్రతను బట్టి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. అందరికీ అందించేందుకు సరిపడా టీకాలు ప్రస్తుతం ఉన్నాయా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. 

ఇక వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని కీలక అధికారాలను ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా తయారీ సంస్థల వద్దే టీకాలు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ముందుగా నిర్ధారించిన ధరల మేరకు సంస్థలు రాష్ట్రాలకు టీకాలు విక్రయించవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రులు ఇతర పరిశ్రమలు సొంతంగా టీకాలు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు వారు తయారు చేసిన టీకాల్లో 50 శాతం కచ్చితంగా కేంద్రానికి అందించాలి. మిగిలిన 50 శాతం టీకాల్ని మాత్రమే బహిరంగ మార్కెట్‌లో విక్రయించాలని షరతు విధించింది.  వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. అందుకనుగుణంగా మూడో విడత టీకా పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాల్ని విడుదల చేసింది. 

18 ఏళ్ళు దాటితే కోవిడ్ టీకా వేయాలి.. సుప్రీంకోర్టులో పిటీషన్

టీకాల ఉత్పత్తిని మరింత ముమ్మరం చేయాలని కరోనా వ్యాక్సిన్ ప్రధాన ఉత్పత్తిదారులైన సీరమ్, భారత్ బయోటెక్ సంస్థలను భారత ప్రభుత్వం కోరింది. ఆ రెండు సంస్థలకు భారీగా రుణాలు మంజూరు చేసింది. సీరమ్ సంస్థకు రూ.3 వేల కోట్లు, భారత్ బయోటెక్ సంస్థకు రూ.1,500 కోట్లు రుణం అందించింది. హైదరాబాదుకు చెందిన భారత్ బయోటెక్ కొవాగ్జిన్ పేరిట వ్యాక్సిన్ అభివృద్ధి చేయగా, ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ టీకా కొవిషీల్డ్ ను సీరమ్ భారత్ లో ఉత్పత్తి చేస్తోంది. 

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   an hour ago


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   8 hours ago


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

   21-07-2021


Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

   20-07-2021


ఇంకా

Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle